Site icon HashtagU Telugu

Accident : కేసీఆర్ ఫాం హౌస్‌లో ప్రమాదం..హాస్పటల్ లో ఎమ్మెల్యే

Palla

Palla

జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) బుధవారం ఉదయం తీవ్రంగా (Injured) గాయపడ్డారు. ఈ ఘటన ఎర్రవెల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంగా ఉన్న ఫాంహౌస్‌లో (KCR Farmhouse) చోటు చేసుకుంది. బాత్రూంలో కాలుజారి కింద పడడంతో పల్లా కాలు విరిగినట్లు సమాచారం. వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు అంబులెన్స్‌లో తరలించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం కేసీఆర్ ఇప్పటికే అక్కడే ఉండగా, పల్లా ఆయనను కలవడానికి మంగళవారం రాత్రి ఫాంహౌస్‌కి చేరుకున్నట్లు సమాచారం.

“భారత ఏకతను ప్రపంచానికి తెలియజేసిన శక్తివంతమైన సందేశం”: విపక్ష నేతల భాగస్వామిపై ప్రధాని మోదీ

ఇదే ప్రదేశంలో గతంలో కేసీఆర్‌ కూడా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటనలో ఆయన్ను కూడా బాత్రూంలో కాలు జారి పడిపోయిన ఘటనలో తుంటి ఎముక విరిగింది. ఆ తర్వాత యశోదా హాస్పిటల్‌లో శస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యాన్ని కోలుకోవడానికి ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు అదే విధంగా పల్లా గాయపడటం ఫాంహౌస్ లో భద్రతా పరంగా జాగ్రత్తలు అవసరమని సూచిస్తోంది.

Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..!!

ఇదిలా ఉండగా మరికాసేపట్లో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ హాజరుకానున్నారు. విచారణకు ముందు ఆయనను కలిసేందుకు కవిత, ఎంపీ బోర్లా వద్దిరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఫాంహౌస్‌కు వెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, ఆర్థిక అవకతవకలపై ఈ కమిషన్ విచారణ జరుపుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో తలెత్తిన సమస్యలపై కేసీఆర్ ఎలా సమాధానం ఇస్తారన్నదిపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.