Case Against KTR: తెలంగాణ ఫార్ములా ఈ- రేసు వ్యవహారంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Case Against KTR) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత దీనిపై విచారించాలని కోరారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌పై నేడు ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
లంచ్ మోషన్ పిటిషన్ వేసిన కేటీఆర్ న్యాయవాది
హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను కేటీఆర్ న్యాయవాది దాఖలు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో పిటిషన్‌ను కేటీఆర్ న్యాయవాది మెన్షన్ చేశారు. సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు కేటీఆర్ న్యాయవాది వెళ్లారు. ఈ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపింది. దీంతో చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను కేటీఆర్ న్యాయవాదులు దాఖలు చేశారు. లంచ్ మోషన్ పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మధ్యాహ్నం 2:15గంటలకు హై కోర్టులో విచారణ ఉండే అవకాశం ఉంది.
Also Read: Hanuman: స్త్రీలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎందుకు తాకకూడదో తెలుసా?
ఏ1గా కేటీఆర్
తెలంగాణలో గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ గురువారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ-1గా ఏసీబీ పేర్కొంది. ఏ-2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ-3గా హెచ్‌ఎండీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై విచారణ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సైతం స్పందించారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే ఈ విషయమై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.