Site icon HashtagU Telugu

Telangana University VC: ఏసీబీ వలలో చిక్కిన తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్

Telangana University VC

New Web Story Copy 2023 06 17t171149.926

Telangana University VC: తెలంగాణ యూనివర్శిటీ నిజామాబాద్ వైస్ చాన్స్‌లర్‌ వీసీ రవీందర్ గుప్తాను ఏసీబీ అరెస్ట్ చేసింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు శనివారం ఆయన నివాసంలో అతన్ని అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌లోని శ్రీ షిర్డీ సాయి ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆర్మూర్‌ టౌన్‌ అధ్యక్షుడు దాసరి శంకర్‌ నుంచి రూ.50వేలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ మేరకు తార్నాకలోని స్ట్రీట్ నంబర్ 1లో ఉన్న తన నివాసానికి రావాలని రవీందర్ శంకర్‌ను కోరాడు. ఈ క్రమంలో అతను అడిగిన మొత్తాన్ని వీసీకి ఇస్తుండగా ఒక్కసారిగా ఏసీబీ దాడి చేసింది. దీంతో ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

శంకర్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాలు కేటాయించినందుకు గాను వీసీ రవీందర్ గుప్తా ఈ మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్‌ చేశాడు. రవీందర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్‌పిఇ, ఎసిబి కేసుల కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ముందు హాజరుపరిచారు.

Read More: 1 Lakh for BCs: బీసీలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ: కేబినెట్ సబ్ కమిటీ!