ABP- C Voter Survey : లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం అంటున్న ఏబీపీ-సీ ఓటర్ సర్వే

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 02:17 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయ డంఖా మోగించిందో..లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) కూడా అదే రిపీట్ కాబోతుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే (ABP- C Voter Survey) వెల్లడించింది. తెలంగాణ లో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికలు జరుగగా..రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ కు జై కొట్టారు. రెండుసార్లు బిఆర్ఎస్ పాలనా చూసిన ప్రజలు..ఒక్కసారి కాంగ్రెస్ పనితీరు చూద్దామని నిర్ణయం తీసుకొని..కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించారు. ఏకంగా 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక లోక్ సభ ఎన్నికల్లో ..భారీ విజయం సాధించాలని కాంగ్రెస్ చూస్తుంటే..ఆ ఛాన్స్ ఇవ్వకూడదని బిఆర్ఎస్ చూస్తుంది. ఈ రెండు పార్టీలతో పాటు బిజెపి కూడా లోక్ సభ ఎన్నికల ఫై కసరత్తులు మొదలుపెట్టింది. ఇలా ఎవరికీ వారు తమ తమ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే..మరోపక్క పలు సంస్థలు ఓటర్ల నాడీ తెలుసుకునే పనిలో పడ్డాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఓపీనియన్ పోల్ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలను గెలుచుకుంటుందని ఈ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ 3 నుంచి 5 సీట్లల్లో మాత్రమే గెలుస్తుందని ఏబీపీ- సీ ఓటర్ అభిప్రాయపడింది. బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తేలింది. బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని నివేదిక ఇచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 38 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని వివరించింది.

Read Also : Guntur Jobs : గుంటూరు ఆస్పత్రుల్లో 94 జాబ్స్.. యాదాద్రి జిల్లాలో యువతకు ఉచితంగా సాంకేతిక శిక్షణ