కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన కే కేశవరావు తన సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నిక అవసరమైంది. తన పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన కేకే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతరాదిత్య సింధియా, కామాఖ్య ప్రసాద్, వివేక్ ఠాకూర్, రాజేభోస్లే, బిప్లవ్ కుమార్ దేవ్, మీసా భారతి, దీపేంద్రసింగ్ హుడా, కేసీ వేణుగోపాల్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. దాంతో వారు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అదేవిధంగా ఒడిశాలో మమతా మొహంత, తెలంగాణలో కే కేశవరావు తమ పదవులకు, పార్టీలకు రాజీనామాలు చేశారు. దాంతో దేశవ్యాప్తంగా మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసేందుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మనుసింఘ్విని రంగంలోకి దించారు.
Read Also : Narayana Murthy: దేశంలో జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు