Site icon HashtagU Telugu

Vooke Abbaiah : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కన్నుమూత

Uke Abbai

Uke Abbai

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో మంచి పేరున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (Abbaiah Vooke) 70 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయ జీవితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైంది.

రాజకీయాల్లో అలాంటి వ్యక్తి మరొకరు లేరు.. 

ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు , రాష్ట్రానికి , దేశానికి ఎంతో కొంత సేవ చేద్దాం..మార్పు తీసుకొద్దాం అనే ఆలోచన ఎవ్వరు చేయడం లేదు. ఎంతసేపు..ఎక్కడి నుండి ఎంత కమిషన్ వస్తుంది..ఇవి చేస్తే ఎంత డబ్బులు మిగులుతున్నాయి..నెక్స్ట్ ఎన్నికల వరకు ఎంత సంపాదించాలి .. ఎలా కబ్జాలు చేయాలి..ఎక్కడ భూములు ఉన్నాయి..ఎలా లాక్కోవాలి ఇలాగే ఆలోచిస్తున్నారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా మూడు సార్లు గెలిచిన ఊకే అబ్బయ్య (Abbaiah Vooke) మాత్రం ఒక రూపాయి కూడా అశించని నిస్వార్ధపరుడు. ఆయన చేతుల మీదుగా కోట్లాది రూపాయిల అభివృద్ధి చేసినప్పటికీ..ఒక్క రూపాయి తనకంటూ దాచుకోలేదు. అందుకే ఇప్పటికే ఆయన గురించి ప్రతి ఒక్కరు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ..రాజకీయాల్లో అలాంటి వ్యక్తి మరొకరు లేరని చెపుతున్నారు.

ఊకే అబ్బయ్య (Abbaiah Vooke) రాజకీయ ఎంట్రీ:

ఊకే అబ్బయ్య సీపీఐ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1994లో ఇల్లందు నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం టీడీపీలో చేరి, 2009లో టీడీపీ తరపున పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ లభించకపోవడంతో బిఆర్ఎస్ (TRS) లో చేరి ఇల్లందు నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన టికెట్ దక్కక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పోరాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.

ఊకే అబ్బయ్య చేసిన అభివృద్ధి:

ఊకే అబ్బయ్య మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి..విజయ డంఖా మోగించారంటే..ఆయన నియోజకవర్గాల్లో ఎంతగా అభివృద్ధి చేసారో మనం గమనించవచ్చు. అప్పటివరకు ఇల్లందు నియోజకవర్గం అంటే పెద్దగా ఎవరికీ తెలియదు..అభివృద్ధి అనేదే లేదు. రోడ్లు లేవు..తాగేందుకు నీరు లేదు..ఎటు చూసిన గుట్టలు, కొండలు..ఎక్కడికి వెళ్లాలన్న మైళ్ల దూరం నడక దారే..అలాంటి ఇల్లందు నియోజకవర్గాన్ని ఊకే అబ్బయ్య ఎంతగానో అభివృద్ధి చేసారు. అప్పట్లోనే గుండాలకు రూ.96 కోట్లతో రోడ్ల నిర్మాణం..పల్లె కోయగూడెం -లచ్చగూడెం ల మధ్య రోడ్ల నిర్మాణం..కామేపల్లి లో మూడు సబ్ స్టేషన్ లు , ఓ జూనియర్ కాలేజ్ తో పాటు 180 అంగన్వాడీ కేంద్రాలను ఏర్పటు చేసారు. ఇలా ఊకే అబ్బయ్య హయాంలో నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి జరిగింది. ఇప్పటికే రెండు నియోజకవర్గ ప్రజలు ఊకే అబ్బయ్య చేసిన అభివృద్ధి వల్లే ఇప్పుడు ఇలా ఉందని..ఆయన చేసిన అభివృద్ధి ఎప్పటికి మరచిపోలేము అని ఎంతో గొప్పగా చెపుతుంటారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి  ముందుగా చెప్పింది ఈయనే:

కేవలం అభివృద్ధి మాత్రమే కాదు బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ముందుగా చెప్పింది కూడా ఊకే అబ్బయ్యనే. ఈ విషయాన్నీ సాక్ష్యాత్తు ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు 2014 లో బయ్యారం సభలో తెలిపారు. అలాంటి ముందు చూపు..అభివృద్దే ఏకైక నినాదమని..డబ్బు ఈరోజు ఉంటుంది  పోతుంది..కానీ చేసిన మంచి పనులు, అభివృద్ధి ఎప్పటికి గుర్తుంది పోతుంది అనడానికి ఉదాహరణ మన ఊకే అబ్బయ్య నే అని చెప్పాలి. నేటి రాజకీయ నేతలు ఊకే అబ్బయ్య ను చూసి ఎంతో నేర్చుకోవాలి..రాజకీయాల్లోకి వచ్చామా..డబ్బు సంపాదించామా..పోయామా అని కాకుండా సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనే తపన కూడా ఉండాలి.

Read Also : Daaku Maharaaj : అమెరికాలో ‘డాకు మహారాజ్’ ఈవెంట్

Exit mobile version