AAP vs Centre: కేసీఆర్ తో భేటీ త‌ర‌వాత కేజ్రీ ఔటేనా?

ఆర్డినెన్స్ ను( AAP vs Centre) అడ్డుకోవ‌డానికి జాతీయ స్థాయి మ‌ద్ధ‌తును కేజ్రీవాల్ స‌మీక‌రిస్తున్నారు. ఆ క్ర‌మంలో తెలంగాణ‌కు ఆయ‌న వ‌చ్చారు.

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 02:47 PM IST

కేంద్ర ఆర్డినెన్స్ ను( AAP vs Centre) అడ్డుకోవ‌డానికి జాతీయ స్థాయి మ‌ద్ధ‌తును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స‌మీక‌రిస్తున్నారు. ఆ క్ర‌మంలో తెలంగాణ‌కు ఆయ‌న వ‌చ్చారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ సంద‌ర్భంగా కేసీఆర్ ను క‌లిసిన నేత‌లు ఏమ‌య్యారు? అనే కోణం నుంచి విప‌క్షాలు విశ్లేష‌ణ వినిపిస్తున్నారు. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ ఎవ‌ర్ని క‌లిస్తే వాళ్లు అధికారం కోల్పోవ‌డమో, కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి ఇబ్బందుల‌ను ఫేస్ చేయ‌డం జ‌రుగుతోంది. అదే విష‌యాన్ని విప‌క్ష నేత‌లు గుర్తు చేస్తున్నారు.

కేంద్ర ఆర్డినెన్స్ ను అడ్డుకోవ‌డానికి జాతీయ స్థాయి మ‌ద్ధ‌తు( AAP vs Centre)  

జాతీయ పార్టీ అంటూ బీఆర్ఎస్ ను స్థాపించిన క్రమంలో ఆయ‌న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను క‌లిశారు. ఆయ‌న కూడా హైద‌రాబాద్ వ‌చ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. సీన్ క‌ట్ చేస్తే, హేమంత్ మీద సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జ‌రిగాయి. మైనింగ్ అక్ర‌మాలు బ‌య‌ట‌కు తీయ‌డం ద్వారా గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. ఒకానొక సంద‌ర్భంగా ఆయ‌న సీఎం ప‌ద‌వికి కూడా ఎస‌రు వ‌చ్చింద‌ని టాక్ న‌డిచింది. ఇక‌, మ‌హారాష్ట్ర‌కు కేసీఆర్ వెళ్లారు. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న సీఎం థాక‌రేను క‌లిశారు. ప్ర‌తి థాక‌రే కూడా సానుకూలంగా స్పందించారు. సీన్ క‌ట్ చేస్తే, శివ‌సేన ప‌రిస్థితి ఏమిటో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం థాక‌రే బ‌దులుగా షిండే సీఎంగా ఉన్నారు.

Also Read : KCR: కాంగ్రెస్ పై కేసీఆర్ స్వారీ, ఎన్డీయే ముద్రలో వైసీపీ, టీడీపీ

క‌ర్ణాట‌క జేడీఎస్ అధినేత కుమార స్వామితో బెంగుళూరు వెళ్లి సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ త‌రువాత కుమార‌స్వామి ప‌లుమార్లు హైద‌రాబాద్ వ‌చ్చారు. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేడీఎస్, బీఆర్ఎస్ పొత్తును అంశాన్ని కేసీఆర్ వినిపించారు. ఆ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఏమి చేశారోగానీ, జేడీఎస్ 19 స్థానాల‌కు ప‌రిమితం అయింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం జేడీఎస్ ఇంటిపోరుతో స‌త‌మ‌తం అవుతోంది. ఇక బీహార్ వెళ్లిన కేసీఆర్ ను ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. మీడియా స‌మావేశంలో కేసీఆర్ తో కొద్దిసేపు కూర్చోవ‌డానికి కూడా ఇష్టంలేక వెంట‌నే లేచి వెళ్లిన దృశ్యాన్ని చూశాం. బెంగాల్ టైగ‌ర్ , సీఎం మ‌మ‌త ఎప్పుడూ కేసీఆర్ ను దూరంగా పెడుతుంటారు. అలాగే త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌న‌దోవ ఏదో త‌నంటూ కేసీఆర్ కు హ్యాండిచ్చారు.

సెంటిమెంట్ గా కేసీఆర్ చాణ‌క్యాన్ని ఢిల్లీ వేదిక‌గా చ‌ర్చ

ఒక వైపు సెంటిమెంట్ గా మ‌రో వైపు కేసీఆర్ చాణ‌క్యాన్ని ఢిల్లీ వేదిక‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే, జాతీయ నేత‌లు ఎవ‌రూ ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌డంలేదు. అందుకే, క‌ర్ణాట‌క సీఎంగా సిద్ధి రామ‌య్య ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి యూపీఏ ప‌క్షాలు అన్నీ కేసీఆర్ ను దూరంగా పెట్టాయి. ఆహ్వానం కూడా ఆ వేడుక‌కు కేసీఆర్ కు ఇవ్వ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను క‌ల‌వ‌డానికి రావ‌డం విచిత్రం. ఇటీవ‌ల ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఇరు రాష్ట్రాల‌కు సంబంధించిన కేసుగా పేరుంది. ఆ కేసులో కేజ్రీవాల్ ను కూడా సీబీఐ విచార‌ణ చేసింది. డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ హెడ్ గా క‌విత ఉంద‌ని ఈడీ, సీబీఐ విచార‌ణ చేయ‌డం చూశాం. ఇప్పుడు ఆ బంధం తాలూకూ చ‌ర్చ‌ల‌కు వ‌చ్చారా? గ్రూప్ 1 అధికారుల వ‌ర‌కు బ‌ద‌లీలు, చ‌ర్య‌ల‌పై ఆర్డినెన్స్ ఇచ్చిన కేంద్రంపై(AAP vs Centre) పోరాడేందుకు మ‌ద్ధ‌తు కోసం కేజ్రీ తెలంగాణ వ‌చ్చారా? అనే అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (AAP vs Centre) 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ శనివారం బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తూ కేంద్రం ఆమోదించిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా (AAP vs Centre) దేశవ్యాప్తంగా కీలక రాజకీయ నేతల మద్దతు కోసం కేజ్రీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. బ్యూరోక్రాట్‌లను నియమించడం లేదా బదిలీ చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఇస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దేశ రాజధానిలో పరిపాలనా సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి శాసన మరియు కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయని మే 11న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పులో పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా పెత్త‌నం చేయ‌డంపై కేజ్రీ మండిప‌డుతున్నారు. అందుకు జాతీయ స్థాయిలో మ‌ద్ధ‌తును కూడ‌గ‌ట్టే ప‌నిలో కేసీఆర్ వ‌ద్ద‌కు వ‌చ్చారు.

సెంటిమెంట్ ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ ను క‌లిసిన లీడ‌ర్లు అధికారాన్ని కోల్పోవ‌డమో, రాజ‌కీయ ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డ‌మో జ‌రుగుతోంది. ఇప్పుడు కేజ్రీవాల్ విష‌యంలో ఏమి జ‌ర‌గ‌బోతుంది? అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Also Read : BRS alliance : కేసీఆర్ మ‌హా కూట‌మి! రేవంత్ కు చిక్కులే!!