Site icon HashtagU Telugu

Bhadradri Kothagudem: ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్న యువకుడు

123

Resizeimagesize (1280 X 720) 11zon

సాధారణంగా వివాహంలో స్త్రీ, పురుషుడు కలిసి వస్తారు. వేద మంత్రాలు.. భాజా భజంత్రీలు.. బంధువులు, స్నేహితుల ఆశీస్సులతో పెళ్లికూతురు మెడలో వరుడు తాళి కడతాడు. అయితే భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)లో ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది. ఓ అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లయింది. ఇద్దరినీ ఒకే వేదికపై ఒకే క్షణంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ కాలంలో ఒక్క అమ్మాయి కూడా దొరకక చాలా మంది పెళ్లికాని ప్రసాద్‌లుగా మిగిలిపోయారు. అయితే ఈయన ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి మూడు కుటుంబాలను ఒప్పించి అందరి సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి కొడుకు ఒక్కడే. కానీ పెళ్లికూతుర్లు మాత్రం ఇద్దరు. ఒకే ముహూర్తంలో ఒకే వేదికపై ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు ముత్తయ్య, రామలక్ష్మీ దంపతులకు రెండవ కుమారుడు. గిరిజన కులాల్లోనే యువతీ యువకులు ఒకరినొకరు ఇష్టపడితే ముందుగానే సహజీవనం చేసే సాంప్రదాయం ఉంది. ఈ క్రమంలో స్వప్న కుమారి ఒక పాపకు జన్మనివ్వగా, సునీతకు కూడా ఒక బాబు పుట్టాడు. ఈ అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని సత్యబాబును కోరగా ఇద్దరిని ప్రేమిస్తున్నారని ఇద్దరినీ పెళ్లి చేసుకుంటారని విషయం చెప్పడంతో సంచలమైంది.

Also Read: Spy Pigeon: ఒడిశాలో గూఢచారి పావురం.. కాళ్లకు కెమెరా, మైక్రో చిప్..!

పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి ముగ్గురి ఇష్టఇష్టాలను తెలుసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారమే వివాహం నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం సత్తిబాబు ఇరువురు అమ్మాయిలకు తాళికట్టి వివాహం చేసుకున్నాడు. ఇరువురు అమ్మాయిలను ఒకే వ్యక్తిని వివాహం చేసుకుంటున్నాడనే వార్త వైరల్ గా మారింది. ఈ వివాహాన్ని చూసేందుకు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం నుంచి చాలామంది ఆ ప్రాంతానికి చేరుకొని వివాహాన్ని తిలకించారు. దీంతో ఆ గ్రామంలో పెళ్లి సందడి నెలకొంది. స్వప్న, సునీత తమకు సత్తిబాబు అంటే ఇష్టమని అందుకే పెళ్లి చేసుకున్నామని చెప్పారు. ఎలాంటి గొడవలు లేకుండా కలిసి జీవిస్తామన్నారు.

Exit mobile version