Free Bus Scheme in Telangana : బస్సు లో బ్రష్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్న మహిళ

ఆర్టీసీ బస్సు లో ప్రయాణం చేస్తూ ఓ మహిళ బ్రష్ చేసుకుంటున్న ఘటన తెలంగాణ లో వెలుగులోకి వచ్చింది

Published By: HashtagU Telugu Desk
Woman Traveling In A Bus Wh

Woman Traveling In A Bus Wh

సాధారణంగా రైలు ప్రయాణం (Train Journey) చేసినప్పుడు బ్రష్ (Brush) చేసుకుంటున్న ప్రయాణకులను చూస్తాం..కానీ ఇక్కడ ఆర్టీసీ బస్సు (RTC Bus) లో ప్రయాణం చేస్తూ ఓ మహిళ బ్రష్ (Woman Brush
) చేసుకుంటున్న ఘటన తెలంగాణ లో వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం తెలంగాణ లో ప్రవేశ పెట్టిన ఫ్రీ బస్సు పథకమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి స్కిం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకం వచ్చిన దగ్గరి నుండి మహిళలలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. కొంతమంది అవసరమై ప్రయాణం చేస్తే చాలామంది టైం పాస్ కోసం చేస్తున్నారు. అంతేనా సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న ఘటనలు కూడా ప్రతి రోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకొంటూ… అడ్డొచ్చినవారిని కూడా వదలడం లేదు. కొన్నిసార్లు ఆ గొడవలు చేతులు దాటి ..రోడ్ ఫై కొట్టుకునే స్థాయికి చేరుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బస్సు ఫ్రీ అని చెప్పి అనేక వింత ఘటనలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది మహిళలు బస్సు లో కూరగాయలు అమ్మడం..పసి పిల్లల కోసం ఉయ్యాల కట్టి ఆడించడం…చీర అల్లికలు కుట్టడం ..ఎల్లిపాయల పొట్టు తీయడం ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ మహిళ బ్రష్ చేసుకుంటూ ప్రయాణించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. టీజీఎస్‌ ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌ వెనుక సీట్లో కూర్చున్న ఓ మహిళ.. ప్రశాంతంగా బ్రష్‌ చేస్తూ కనిపించింది. ఇంటి వద్ద టైం ఎందుకు వేస్ట్‌ చేసుకోవాలనుకుందో ఏమో.. గాని ఇలా బస్సు లోనే బ్రష్ చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది. దీనిపై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రీ అని చెప్పి ఎంత దారుణంగా వాడుకుంటే..ఆ ప్రభావం మళ్లీ ప్రజలపైనే పడుతుందని..ఏ ప్రభుత్వం కూడా తమ జేబులో నుండి డబ్బు పెట్టదని, ప్రజలపై టాక్స్ రూపంలో వసూళ్లు చేస్తుందని అంటున్నారు. ఇక ఇదే సందర్బంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కు సైతం సలహా ఇస్తున్నారు. బాబు గారు చూడండి..ఫ్రీ పథకాన్ని ఎంత దారుణంగా వాడుకుంటున్నారో..మీ దగ్గర కూడా పెడితే కొన్ని కండిషన్లు పెట్టండి..లేదంటే ఇలాగే ప్రభుత్వ ఫ్రీ పథకాన్ని వృధాగా వాడుకుంటారు అని చెపుతున్నారు.


Read Also : Free Bus Travel: ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష

  Last Updated: 29 Jul 2024, 01:44 PM IST