బీజేపీకి ‘డప్పు’ కొట్టిన హరీశ్ రావ్.. సోషల్ మీడియాలో పిక్ వైరల్!

తెలంగాణ రాజకీయాలన్నీ హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతుంటే.. మరోవైపు చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

  • Written By:
  • Publish Date - October 23, 2021 / 02:22 PM IST

తెలంగాణ రాజకీయాలన్నీ హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతుంటే.. మరోవైపు చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు ప్రచార కార్యక్రమాల్లో అధికార పార్టీల నేతలు హరీశ్ రావు ముందే.. ‘జై ఈటల నినాదాలు’ చేయడంతో వీడియోలు, ఫొటోలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. ఆ ఘటన మరుకముందే తాజాగా మరో సంఘటన వైరల్ గా మారడం చర్చనీయాంశంగా మారుతోంది.

టీఆర్ఎస్ నాయకుడు, ఆర్థిక మంత్రి హరీశ్ రావు బీజేపీ అధికారిక సింబల్ ‘కమలం’తో డప్పు వాయిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమిని అంగీకరించిందని, బీజేపీ మద్దతుదారులు పేర్కొంటున్న విషయాలు కూడా డిజిటల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీ తరపున గెలిచి తనకు తిరుగులేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. హుజురాబాద్ బరిలో ప్రధాన పార్టీలు నిలిచినప్పటికీ ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది.

ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పలుమార్లు కౌశిక్ రెడ్డితో సహా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు గెల్లుకు బదులు ఈటలకు ఓటు వేయాలని ఓటర్లను కోరడం ఆసక్తిగా మారింది. ఈటల చాలా కాలంగా టీఆర్ ఎస్ లో ఉన్నందున ర్యకర్తలు ఇప్పటికీ ఆయన పేరును తమ మనసులోంచి తొలగించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు బీజేపీ గుర్తు ఉన్న డప్పు వాయించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని, హరీశ్‌రావు బీజేపీని ప్రోత్సహిస్తున్నారని చెప్పిన ఈటల వర్గీయులు పేర్కొంటున్నారు.