Hyderabadi fly overs : త్రివర్ణంలోకి మారిపోయిన భాగ్యనగరి ఫ్లైఓవర్లు…వైరల్ వీడియో..!!

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆజాదీకాఅమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 06:50 PM IST

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆజాదీకాఅమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి జాతీయ జెండాల తయారీ భారీ ఎత్తున కొనసాగుతుండగా….దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆయా నిర్మాణాలపై జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రధాన నగరాల్లోని ప్రధాన నిర్మాణాలన్నీ కూడా త్రివర్ణమయం అయ్యాయి.

దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పదిహేను రోజులపాటు సాగే ఈ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాజధాని హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లు త్రివర్ణంలోకి మారిపోయాయి. నగరంలోని ఫ్లైఓవర్లు కూడా మువ్వన్నెల రంగును అద్దుకున్నాయి. ఇలా త్రివర్ణంలోకి మారిపోయిన ఓ ఫ్లైఓవర్ కు సంబంధించి మువ్వెన్నెల రంగును అద్దుకున్నాయి. ఓ ఫ్లైఓవర్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.