Site icon HashtagU Telugu

Hit By Teacher : హోమ్ వర్క్ చేయలేదని యూకేజీ బాలుడిపై టీచర్ దాడి..బాలుడు మృతి

Ukg Student Dies In Hyderab

Ukg Student Dies In Hyderab

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. హోమ్ వర్క్ చేయలేదని యూకేజీ బాలుడి తలపై టీచర్ పలకతో కొట్టడం తో ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో పాఠశాల ఎదుట బాలుడి మృతదేహంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు , విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు.

వివరాల్లోకి వెళ్తే..

రామంతపూర్ (Ramanthapur) వివేక్ నగర్ లోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో హేమంత్ (Hemanth ) అనే విద్యార్థి యూకేజీ (UKG) చదువుతున్నాడు. ఎప్పటిలాగే శనివారం స్కూల్ కు వెళ్లిన హేమంత్ ను హోమ్ వర్క్ చేయలేదని టీచర్ (Teacher ) తలపై పలకతో కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనై అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మృతదేహన్ని అంత్యక్రియలు కోసం వారి స్వస్థలం వనపర్తికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Read Also : Venkatesh Saindhav : సంక్రాంతికి సైంధవ్.. బిగ్ ఫైట్..!