Toopran – Plane Crash : మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో సాంకేతిక లోపంతో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ హెలికాప్టర్ కుప్పకూలింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ కొద్దిసేపటికే.. సోమవారం ఉదయం 8.30 గంటలకు తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెళ్లి సమీపంలో అదుపు తప్పి క్రాష్ అయింది. కూలిన వెంటనే హెలికాప్టర్‌లో మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్, ట్రైనీ పైలెట్ గుర్తించలేని విధంగా సజీవ దహనమయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
హెలికాప్టర్ కూలగానే భారీ శబ్దం రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దాన్ని దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చెందిన శిక్షణ హెలికాప్టర్‌గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలకు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వాటిని అంబులెన్స్ సహాయంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు హైదరాబాద్‌కు(Toopran – Plane Crash) తరలించారు.
