CPR : గుండెపోటుకు గురైన వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీస్‌

హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై ఓ యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడాడు. సైబరాబాద్

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 06:58 AM IST

హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై ఓ యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న డి.రాజశేఖర్ ఆరామ్‌ఘర్ క్రాస్‌రోడ్‌లోని బస్టాండ్ వద్ద కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి బ్ర‌తికించాడు. న‌డుచుకుంటూ వెళ్తున్న ఓ వ్య‌క్తి ఒక్క‌సారిగా రోడ్డుపై కుప్ప‌కూలిపోయాడు. దీంతో వెంట‌నే స్పందించినక కానిస్టేబుల్ రాజ‌శేఖ‌ర్ ఆ వ్య‌క్తి వ‌ద్ద‌కు వెళ్లి సీపీఆర్ చేసి స్పృహ‌లోకి తెచ్చాడు. ఆ త‌రువాత ఆ వ్య‌క్తిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

కానిస్టేబుల్ రాజ‌శేఖ‌ర్ ని మంత్రి హరీష్ రావు అభినందించారు. CPR చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడార‌ని మంత్రి ట్విట్టర్‌లో అభినందించారు. ఇటువంటి సంఘటనలు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం వచ్చే వారం ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు, కార్మికులందరికీ CPR శిక్షణను నిర్వహిస్తుందని హరీష్ రావు చెప్పారు. రాజశేఖర్ సాహసాన్ని డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. సీపీఆర్ చేయ‌డం వ‌ల్ల ఓ వ్య‌క్తి ప్రాణాలు కాపాడ‌గ‌లిగాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాజశేఖర్ సమయానుకూల చర్యను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. సీపీఆర్‌ను కానిస్టేబుల్ సమర్థంగా నిర్వహించడం వల్ల ఓ యువకుడి ప్రాణం కాపాడిందని ఆయన అన్నారు. యువ‌కుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజ‌శేఖ‌ర్‌కు సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర బ‌హుమ‌తి ఇచ్చారు.