Site icon HashtagU Telugu

Tipper Lorry : గచ్చిబౌలి లో బీభత్సం చేసిన ఓ టిప్పర్ లారీ

Tipper Lorry Gachibowli

Tipper Lorry Gachibowli

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో సోమవారం ఓ టిప్పర్ (Tipper Lorry) బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో టిప్పర్ అదుపుతప్పింది. సిగ్నల్ దగ్గర ఆగిన నాలుగు కార్లు, రెండు బైక్ ల పైకి దూసుకెళ్లింది. దీంతో వాహనాలన్నీ నుజ్జు నుజ్జు అయ్యాయి. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నసీర్ అనే యువకుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో అబ్దుల్ అనే విద్యార్థికి కాలు విరిగిందని వైద్యులు తెలిపారు.

ప్రమాదం విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు టిప్పర్ (Tipper Lorry) డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో టిప్పర్ అదుపుతప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read:  Adimulapu Suresh : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంట విషాదం