Site icon HashtagU Telugu

Kamareddy : కేసీఆర్ ఫై వెయ్యి మంది పోటీ..?

Cm Kcr

Cm Kcr

తెలంగాణ లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (2023 Telangana Elections) జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల తాలూకా పనులు మొదలుపెట్టింది. మరోపక్క అధికార పార్టీ తో పాటు మిగతా అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన , ఎన్నికల ప్రచారం , ఎన్నికల కమిటీ తదితర వాటిపై దృష్టి పెట్టాయి. అయితే ఈసారి అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS)కు గట్టి షాక్ ఇవ్వాలని ఇతర పార్టీల తో పాటు పలు కుల సంఘాలు భావిస్తున్నాయి.

ఈసారి సీఎం కేసీఆర్ (CM KCR) రెండు చోట్ల నుండి బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గజ్వేల్ (Gajwel Assembly Constituency) నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా..వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డి (Kamareddy Assembly constituency) నుండి పోటీ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఎప్పుడైతే కేసీఆర్ కామారెడ్డి నుండి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారో..అప్పటి నుండి అక్కడి రాజకీయం మరింత వేడెక్కింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కాయితీ లంబాడీలు (Kaithi Lambadis) సిద్ధం అవుతున్నారు. ఒకరిద్దరు కాదు ఏకంగా వెయ్యికిపైగా లంబాడీలు కేసీఆర్ ను ఢీ కొడతామంటూ శబదం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అధికార పార్టీ ని టెన్షన్ పెడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

1,016 లంబాడీలను పోటీలోకి దింపుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను మండలాలవారిగా ఆయన ప్రకటించారు. ప్రస్తతం ఓసీ జాబితాలో ఉన్న కాయితీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేసీఆఱ్ ఇఛ్చిన గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీఎం తన నిర్ణయాన్ని ఇప్పటికైనా వెల్లడించనట్లయితే..మూడు, నాలుగు రోజుల్లో సచివాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. పోడు పట్టాలతోపాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గతకొన్నాళ్లుగా నిరసనలు , ఏక్తా ర్యాలీ వంటివి చేస్తూ వస్తున్నారు. దశాబ్దాలుగా తమకు తీరని అన్యాయం జరుగుతుందని తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోడు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వీరి డిమాండ్స్ ఫై కేసీఆర్ దృష్టి పెడతారో లేదో చూడాలి.

Read Also : Esha Rebba : బికినిలో ఈషా రెబ్బ హాట్ ఫోజులు