Rajasingh: ఉగ్రవాద సంస్థ నాపై కుట్రకు పాల్పడుతోంది: రాజాసింగ్.

ప్రతి ఏటా ఘనంగా జరిపే ఈ వేడుకలకు రాజాసింగ్ ముఖ్య అతిథిగానూ హాజరవుతుంటారు.

Published By: HashtagU Telugu Desk
Rajasingh

Rajasingh

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందూ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. హనుమాన్ జయంతి, శ్రీరామ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా ఘనంగా జరిపే ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగానూ హాజరవుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ తనపై కుట్ర పన్నుతున్నదని రాజా సింగ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో గురువారం రామనవమి ఊరేగింపు సందర్భంగా తనను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ పేర్కొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, రాష్ట్ర బీజేపీ కార్యాలయం, రామనవమి ఊరేగింపుపై బాంబులు విసిరేందుకు ఓ ఉగ్రవాది ప్లాన్ చేశాడంటూ హైదరాబాద్ వాసి ఒకరు పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖను రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బహ్రెయిన్‌లోని ముఖ్తార్ బ్రిగేడ్‌లో పనిచేస్తున్న ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం గోషామహల్ శాసనసభ సభ్యుడు రాజా సింగ్ అని ఉమా మహేశ్వరి రాసిన లేఖలో ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు రావడం రాజాసింగ్ కు కొత్తేమీ కాదు. గతంలోనూ బెదిరింపులు, డెత్ కాల్స్, ఈమెయిల్స్ చాలా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజాసింగ్ ఉగ్రవాద కదలికల గురించి మాట్లాడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

  Last Updated: 29 Mar 2023, 06:45 PM IST