Vikarabad: వికారాబాద్ లో పొలాల్లో కూలిపోయిన వింత వస్తువు..

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఆకాశం నుంచి పడిపోయిన ఓ వింత వస్తువు (Strange Object)

Published By: HashtagU Telugu Desk
Vikarabad Strange Object

Vikarabad

వికారాబాద్ (Vikarabad)జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఆకాశం నుంచి పడిపోయిన ఓ వింత వస్తువు (Strange Object) స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. భారీ వస్తువు ఇక్కడి పొలాల్లో కూలిపోగా, రైతులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పొలాల వద్దకు చేరుకుని ఆ వస్తువును పరిశీలించిన అధికారులు అది వాతావరణ మార్పులను పరిశీలించేందుకు ప్రయోగించిన హీలియం బెలూన్ అని వెల్లడించారు.

వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం ఇలాంటి బెలూన్లను గగనతలంలోకి ప్రయోగిస్తుంటారని తెలిపారు. మొగిలిగుండ్ల వద్ద కూలిపోయిన బెలూన్ ను టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ పంపించినట్టు వెల్లడించారు.స్థానికులు ఆ భారీ బెలూన్ ను ఆసక్తిగా తిలకించారు. బెలూన్ చుట్టూ కెమెరాలు ఉన్నాయని, ఆ బెలూన్ లో కూర్చోవడానికి ఓ సీటు కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు.

Also Read:  Border Issue: కర్ణాటకకు మధ్య మహారాష్ట్ర ముదిరిన సరిహద్దు వివాదం..!

  Last Updated: 07 Dec 2022, 05:17 PM IST