హైదరాబాద్(Hyderabad)లో బస్సు ప్రయాణికులకు (Bus Passengers) శుభవార్త. ఇకపై బస్సుల కోసం నిమిషాల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఎక్కడున్నా బస్సు లైవ్ లొకేషన్‌ను తెలుసుకునే అవకాశం కల్పించబోతున్నారు. జీహెచ్‌ఎంసీ బస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (Bus Information System) పేరుతో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ బస్సు ఎక్కడుందో, ఎంతసేపట్లో వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు.
Game Changer : మరో రెండు రోజుల్లో ఓటిటి లోకి ‘గేమ్ ఛేంజర్’
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బస్సులను ట్రాక్ చేయడానికి 2,800 బస్సుల్లో జీపీఎస్ సిస్టమ్‌ను అమర్చనున్నారు. బస్టాప్‌లలో భారీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేసి, వాటిని ప్రత్యేక యాప్‌తో కనెక్ట్ చేయనున్నారు. స్మార్ట్‌ఫోన్ లేని ప్రయాణికుల కోసం 1,250 బస్టాప్‌ల వద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి, రియల్ టైమ్ బస్సు సమాచారం అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. బస్సు నంబర్, ప్రస్తుత స్థానం, రాకపోకల సమయం వంటి వివరాలు స్క్రీన్‌లపై కనిపించనున్నాయి.
ఈ కొత్త పద్ధతిని అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీతో కలిసి పనిచేస్తోంది. ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో (PPP మోడల్) ప్రాజెక్ట్‌ను నిర్వహించనున్నారు. బస్టాప్‌ల వద్ద ఏర్పాటు చేసే స్క్రీన్‌లకు అడ్వర్టైజ్మెంట్ స్థలం కేటాయించి, వచ్చే ఆదాయంతో యాప్ నిర్వహణ, మెయింటెనెన్స్ నిర్వహించనున్నారు. టెండర్ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే, రెండు నెలల్లో కొత్త సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ యాప్ విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. బస్సులు సమయానికి అందుబాటులో ఉన్నాయా? ఎంతసేపట్లో వస్తాయి? వంటి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా ప్రయాణంలో సమయం వృధా కాకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.