Site icon HashtagU Telugu

Kathi Karthika: కాంగ్రెస్ పార్టీకి షాక్, బీఆర్ఎస్ లోకి కత్తి కార్తీక

Kathi Karthika1

Kathi Karthika1

Kathi Karthika: ఏ పార్టీకి వలసలు ఎక్కువగా ఉంటే ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు నేతలు. అయితే ప్రతిసారీ ఇదే ఫార్ములా పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు. తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసినప్పటికీ చేరికలు, జంపింగ్స్ కొనసాగుతున్నాయి. ఉన్న పార్టీలో అసంతృప్తి ఇతర పార్టీల వైపు చూసేలా చేస్తోంది.

ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక.. ​​నేడు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. గతేడాది జులైలో తాతయ్య స్ఫూర్తితో కాంగ్రెస్‌లో చేరిన కార్తీక ఇటీవలే ఆ పార్టీని వీడారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఆమె బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

2021లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చిన కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక పాత్ర పోషించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపారు.