Site icon HashtagU Telugu

TG 09 0001 : టీజీ 09 0001 నంబరుకు రూ.9.61 లక్షలు

Tg 09 0001

Tg 09 0001

TG 09 0001 : కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది. అదేనండీ.. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఈ కోడ్ వచ్చేసింది!! ఇంతకు ముందు TS పేరుతో ఉన్న రిజిస్ట్రేషన్లను శుక్రవారం (మార్చి 15) నుంచి TG పేరుతో మార్చారు. కోడ్‌ ప్రారంభమైన తొలిరోజే గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో భారీగా ఆదాయం వచ్చింది. ఫీజు, ఫ్యాన్సీ నంబర్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రూ.2.51 కోట్ల ఆదాయం రాగా.. అందులో రూ.1.32 కోట్లు మూడు జిల్లాలనుంచే సమకూరడం విశేషం.అన్ని కార్యాలయాల్లో టీజీతో పాటు 0001 (TG 09 0001) కొత్త సీరిస్‌ ప్రారంభం కావడంతో.. ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవడానికి కొత్తవాహనాలు కొన్నవారు ఆసక్తి చూపించారు.

We’re now on WhatsApp. Click to Join

వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజీ ఉంటుంది. తెలంగాణలో వాహనాల నంబర్లు టీఎస్ నుంచి టీజీకి మారాయి. టీజీ సిరీస్‌లో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపునకు శుక్రవారం మొదటిరోజే మంచి డిమాండ్ లభించింది. తాజాగా ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు ద్వారా రూ.30.49 లక్షలు ప్రభుత్వానికి లభించాయి.  ‘టీజీ 09 0001’ నంబరు కోసం రుద్రరాజు రాజీవ్‌ కుమార్‌ బిడ్డింగ్‌లో ఏకంగా రూ.9.61 లక్షలు చెల్లించడం విశేషం. ‘టీజీ 09 0909’ నంబరును భవ్యసింధు ఇన్‌ఫ్రా సంస్థ రూ.2.30 లక్షలు చెల్లించి దక్కించుకుంది. ‘టీజీ 09 0005’ నంబరుకు శాన్వితారెడ్డి రూ.2.21 లక్షలు చెల్లించారు. ‘టీజీ 09 0002’ నెంబర్‌ కోసం దుశ్యంత్‌ రెడ్డి రూ.1.22 లక్షలు చెల్లించారు. ‘టీజీ 09 0369’ నెంబర్‌కు రూ.1.20 లక్షలు, ‘టీజీ 09 0007’ నెంబర్‌ కోసం రూ.1.07 లక్షల చొప్పున  ఔత్సాహికులు చెల్లించారు.

Also Read : RS Praveen Kumar : కవిత అరెస్టుపై ఆర్ఎస్పీ ట్వీట్.. నెటిజన్లు ఏమన్నారో తెలుసా ?

ఆర్టీఏ బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మొదటి రోజు ప్రత్యేక నెంబర్లపైన రూ.3.32 లక్షల ఆదాయం లభించింది. పశ్చిమ మండలం టోలిచౌకి కార్యాలయంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో రూ.5.38 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. సికింద్రాబాద్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్‌లపైన రూ.8.52 లక్షలు లభించాయి. 0009, 0999 లాంటి నంబర్లను వాహనదారులు పోటీపడి మరి దక్కించుకున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత టీఎస్‌ కోడ్‌తోనే రిజిస్ట్రేషన్లు చేశారు. మరో 15 రోజుల వరకు పాత స్లాట్లు నడవనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తవాహనాలు కొనుగోలు చేసినవారికి మాత్రం TG కోడ్‌తో సిరీస్‌ కేటాయిస్తున్నారు. పాత విధానం ప్రకారమే నంబర్లకు నిర్ణీత ఫీజు ఉంటుందని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

Also Read :Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ఏమిటి ? కల్వకుంట్ల కవితపై అభియోగాలు ఏమిటి ?