Site icon HashtagU Telugu

Prisoner Escaped : నకిలీ బెయిల్ పత్రాలతో చంచల్‌గూడ జైలు నుంచి ఖైదీ పరార్

Prisoner Escaped From Chanchalguda Jail Hyderabad With Fake Bail Documents

Prisoner Escaped : నకిలీ బెయిల్ పత్రాలతో ఒక అండర్ ట్రయల్ ఖైదీ హైదరాబాద్‌లోని  చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. పరారైన ఖైదీని హైదరాబాద్‌‌ పాతబస్తీ పరిధిలోని సంతోష్ నగర్ హెచ్ఐజీ కాలనీకి చెందిన షుజాత్ అలీఖాన్‌‌‌గా గుర్తించారు. ఇతడిపై భూకబ్జా, మోసం కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఇతడిని నవంబరు 2న రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత కోర్టులో హాజరుపర్చి, న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే నవంబరు 26న అతడు చంచల్‌గూడ సెంట్రల్ జైలు(Prisoner Escaped) నుంచి విడుదలయ్యాడు.

Also Read :Porn Racket Case : సినిమా ఛాన్స్ పేరుతో దగా.. యువతులతో పోర్న్‌ మూవీస్.. రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు

షుజాత్ అలీఖాన్‌‌‌ సంబంధీకులు పాత బెయిల్ పత్రాలను ఫోర్జరీ చేసి.. నకిలీ బెయిల్‌ పత్రాలను క్రియేట్ చేయించారు. వాటిని  చంచల్‌గూడ జైలు అధికారులకు నవంబరు 26న సమర్పించారు. అధికారులు వాటిని అంతగా తనిఖీ చేయకుండానే షుజాత్ అలీఖాన్‌‌‌‌ను జైలు నుంచి విడుదల చేశారు. ఆ తర్వాత బెయిల్ పత్రాల వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో జైలు అధికారులు సెర్చ్ చేయగా అసలు విషయం తెలిసొచ్చింది. ఆ బెయిల్ పత్రాలు నకిలీవి అని తేలింది. దీంతో షుజాత్ అలీఖాన్‌‌‌‌ను గాలించేందుకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పోలీసు టీమ్స్ అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నాయి. షుజాత్‌కు సంబంధించిన వారి నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి.

Also Read :AEE Nikesh : తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్

అతగాడికి 141 ఏళ్ల జైలుశిక్ష

ఓ వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తల్లి ఇంట్లో లేని సమయంలో బాలికపై సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం అతడికి 141 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతోపాటు అతడిపై రూ.7.85లక్షల జరిమానా  విధించింది. బాలికకు పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వానికి మంజేరి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలు నిబంధనల ప్రకారం అతడు 40 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలి.