Folk Singer Mounika : ఈ అమ్మాయి పాడితే.. పుష్పరాజ్ ఊగిపోవాల్సిందే..!

తెలంగాణ అంటేనే కవులు.. కళాకారులకు పుట్టినిల్లు. ముఖ్యంగా జానపదాలు తమదైన స్టయిల్ పాడే సింగర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటివాళ్లలో ముందుంటారు సింగర్ మౌనిక యాదవ్.

  • Written By:
  • Updated On - November 1, 2021 / 05:43 PM IST

తెలంగాణ అంటేనే కవులు.. కళాకారులకు పుట్టినిల్లు. ముఖ్యంగా జానపదాలు తమదైన స్టయిల్ పాడే సింగర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటివాళ్లలో ముందుంటారు సింగర్ మౌనిక యాదవ్. ఈమెది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని కానిపర్తి గ్రామం. పెరిగింది గోదావరిఖని. జమ్మికుంటలో టెన్త్, డిగ్రీ పూర్తిచేసింది. మౌనిక యాదవ్ మంచి డాన్సర్ కూడా. ఆమె అక్క కూడా మంచి సింగర్. స్కూల్ డేస్ నుంచే తల్లిదండ్రులు, టీచర్లు వీరిని ఆటపాటల్లో ప్రోత్సహించారు. ఫోక్ రైటర్స్ స్పూర్తితో పాటలనే ఊపిరిగా బతికేది. తెలంగాణ ఉద్యమంలో మౌనిక యాదవ్ పాడిన పాటలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.  దానికి కారణం..  జనపదాలు ఈ అమ్మాయి గొంతులో ఇట్టే ప్రాణం పోసుకుంటాయి. గోదావరి గలగలల మాదరిగా ఆమె నోటి నుంచి జనపదాలు అలా జాలువారుతుంటాయి.

ఇప్పటివరకు మౌనిక 20కుపైగా బతుకమ్మ పాటలను పాడారు. ఈమె పాడటమే కాకుండా.. బతుకమ్మ ఆల్బమ్స్ లోనూ నటిస్తుంది కూడా. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతి ఏడాది ఓ కొత్త పాటను తెలంగాణ ప్రజలకు అందిస్తుంది మౌనిక. మౌనిక యాదవ్ పాడిన జానపద పాటలు, డీజే పాటలు యూట్యూబ్ లో లక్షలు, మిలియన్లలో వ్యూస్ సంపాదించాయి. దీంతో సింగింగ్ నే కెరీర్ గా సెలెక్ట్ చేసుకుంది. ఇప్పటివరకు మౌనిక పాడిన పాటల్లో ‘పూత పులన్నీ పూసే’,  ‘నగిరే నాగ నందనో’ లాంటి పాటలు హైలైట్ గా నిలిచాయి.

జనపదాలు మౌనిక గొంతులో చక్కగా పలకడంతో పలువురు సంగీత దర్శకులు పాడించాలనుకున్నారు. అయితే మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మౌనిక టాలెంట్ గుర్తించి అవకాశం ఇచ్చాడు. పుష్ప మూవీలో ‘‘నువ్ అమ్మీ.. అమ్మీ అంటుంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ .. సామీ’’ అనే పాటతో మెస్మరైజ్ చేసింది మౌనిక. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. వేలకొద్ది లైక్స్ తో ట్రెండింగ్ లో నిలుస్తోంది.