Site icon HashtagU Telugu

Telangana Rising 2047 : ప్రపంచ వేదికపై సరికొత్త అధ్యాయం

A New Chapter On The World

A New Chapter On The World

ఒకప్పుడు కేవలం ఒక ప్రాంతీయ ఆకాంక్షగా చూసిన తెలంగాణ, నేడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించింది. ఇది కేవలం ఆర్థిక గణాంకాలకే పరిమితం కాలేదు, ఇది ఒక ప్రభంజనంలా రాష్ట్రమంతటా విస్తరించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ప్రపంచ దేశాలు ‘శభాష్’ అనే రీతిలో అభివృద్ధి చెందింది. అగ్రశ్రేణి బహుళజాతి సంస్థలకు కేంద్రంగా మారి, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, సృజనాత్మకత, సాంకేతికత మరియు ప్రతిభకు గ్లోబల్ హబ్‌గా నిలుస్తోంది. కేవలం రాజధానికే కాకుండా, రాష్ట్రంలోని మారుమూల పల్లెలు సైతం అద్భుతమైన అభివృద్ధిని సాధించాయి. వ్యవసాయం, వాణిజ్యం, విద్య , వైద్య వంటి ప్రతి రంగంలోనూ అనూహ్యమైన వృద్ధిని కనబరుస్తున్న తెలంగాణ, మరింత పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌తో ప్రపంచ దేశాలను సాదరంగా ఆహ్వానిస్తోంది.

Sri Venkateswara University Academic Consultants Recruitment : నిరుద్యోగుల పరిస్థితి ఏంటి.. ఏపీ హైకోర్టు సీరియస్?

ప్రజల ఆకాంక్షను ప్రగతి లక్ష్యంగా మలచడంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో ప్రశంసనీయం. రేవంత్ దార్శనికతలో, రాష్ట్ర అభివృద్ధికి ప్రజల శక్తి, వారి సృజనాత్మకత మరియు లక్ష్య సాధన ప్రధాన చోదక శక్తులుగా మారాయి. హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం భౌతిక నిర్మాణాలకే పరిమితం కాకుండా, మానవ వనరుల అభివృద్ధి మరియు నైపుణ్యాల పెంపుదలపై దృష్టి సారించి, ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా, స్టార్టప్‌లకు స్వర్గధామంగా ఎదగడానికి దోహదపడుతుంది. సాంస్కృతిక, కళా, పరిశోధన రంగాలలోనూ కీలక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మహానగరం, అవకాశాల సమాహారంగా నిలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ చొరవ, అభివృద్ధిని కొందరికే పరిమితం చేయకుండా, ప్రతి పౌరుడికి సమాన భాగస్వామ్యం, సమాన న్యాయం అందించే పారదర్శక పాలనకు పునాది వేసింది. “తెలంగాణ రైజింగ్” ఆర్థిక వృద్ధి ప్రణాళికతో పాటు, పౌరుల ఆత్మగౌరవాన్ని, సంక్షేమాన్ని పెంచే ఒక ఉద్యమంగా కొనసాగుతోంది.

Exit mobile version