Site icon HashtagU Telugu

Telangana Women: అమెరికాలో ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ యువతి.. జై శంకర్ కు లేఖ రాసిన తల్లి?

Telangana Women

Telangana Women

అమెరికాలో తెలంగాణకు చెందిన ఒక యువతి ఆకలితో అలమటిస్తోంది. దీంతో కూతురు పరిస్థితి తేల్చుకున్న తన తల్లి కేంద్ర విదేశాంగ మంత్రికు లేఖ రాసింది. ఇంతకీ ఆ యువతి అక్కడికి ఎందుకు వెళ్ళింది? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఒక మహిళ అమెరికాలో మాస్టర్స్ చేయాలని తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళింది. హైదరాబాద్‌ లోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ మాస్టర్స్‌ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆమె తరచూ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది.

కానీ రెండు నెలలుగా కూతురు నుంచి ఎలాంటి స్పందన లేదు. హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు ఆమెను గుర్తించి తల్లికి తెలియజేశారు. ఆమె వస్తువులను ఎవరో దొంగలించారని దీంతో చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని సమాచారం అందించారు. అంతేకాకుండా లులు మిన్హాజ్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపారు. దాంతో వెంటనే విషయం తెలుసుకున్న సదరు మహిళ తల్లి తన కుమార్తెను తిరిగి భారత్‌ తీసుకురావాలని వహాజ్ ఫాతిమా కేంద్రమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖలో సదరు మహిళ ఈ విధంగా రాసకొచ్చింది..

నా కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అమెరికాకు మాస్టర్స్‌ చేసేందుకు వెళ్లింది. రెండు నెలలుగా ఆమె నాకు ఫోన్‌ చేయడం లేదు. హైదరాబాద్‌ నుంచి మాకు తెలిసిన కొందరు అమెరికాకు వెళ్లారు. చికాగోలో నా కుమార్తెను గుర్తించారు. ఆమె వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆకలితో అలమటిస్తోంది. ఆమెను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నాను అని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం సదరు మహిళలకు సంబంధించిన ఫోటోలు అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version