Site icon HashtagU Telugu

Vikarabad : వడ్డీ కట్టలేదని ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టిన వడ్డీ వ్యాపారి

A Moneylender Who Beat A Pe

A Moneylender Who Beat A Pe

రోజు రోజుకు వడ్డీ వ్యాపారాలు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అవసరం కోసం డబ్బు తీసుకున్న వ్యక్తులపై దాడులకు తెగపడుతున్నారు. కొంతమంది అధిక వడ్డీ వసూళ్లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరికొంతమంది చెప్పిన సమయానికి డబ్బు చెల్లించలేదని చెప్పి దాడులకు పాల్పడుతున్నారు. ప్రతి రోజు ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఈ తరహా ఘటనే జరిగింది. వడ్డీ కట్టలేదని చెప్పి ఓ వడ్డీ వ్యాపారి (Moneylender)..ఓ వ్యక్తి ఫై దాడికి తెగబడ్డారు. చేతులతో కొడుతూ, కాళ్లతో తంతూ విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

తాండూరులో గల రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య(Balaiah) తన అవసరాల కోసం మేతరి రవి వద్ద అప్పు తీసుకున్నాడు. మూడు నెలల క్రితం రూ.5 వేల అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి వడ్డీ కూడా కట్టడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారి (Moneylender) రవి యువకుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పు గురించి అడిగాడు. ఫోన్ చేస్తా.. అప్పు కడతానని చెప్పిన రవి వినిపించుకోలేదు. ఇప్పటికే 3 నెలలు అవుతుంది.. అసలు లేదు, వడ్డీ కట్టడం లేదన్నారు. ఆ వీడియోలో మిగతా వారి మాటలు వినిపించాయి. వ్యాపారి రవిని కొట్టొద్దు.. కొట్టొద్దు అని చెప్పినా వినిపంచుకోలేదు. చివరికీ రవి కుమారుడు నాన్న వద్దు కొట్టొద్దు.. ఇప్పటికే చాలా కొట్టావు అని చెప్పడం ఆ వీడియోలో వాయిస్ వినిపించింది. తన డబ్బులు తనకు ఇవ్వాలి అన్నట్టు రవి మొండిగా ప్రవర్తించాడు. బాలయ్యపై విచక్షణరహితంగా దాడి చేశాడు. ఆ వీడియో చూసిన పలువురు వడ్డీ వ్యాపారి రవి తీరును ఖండిస్తూ..దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also : Chandrababu: సీట్లు త్యాగం చేసిన వారికీ చంద్రబాబు భరోసా