మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలో రాజకీయ వాతావారణాన్ని మరింత వేడెక్కించింది. నామినేషన్లు ముగియడంతో…ప్రచారంలో బిజీగా ఉన్నారు ప్రధాన పార్టీల నేతలు. ఈ క్రమంలోనే మునుగోడు, చౌటుప్పల్ లలో వాల్ పోస్టర్లు కలకలం రేపాయి.
మునుగోడు ప్రజలారా…!!!
మేము మోస పోయాం…!!మీరు మోసపోకండి…!!అంటూ దుబ్బాక, హుజూరా బాద్ ప్రజల పేరుతో వెలసిన పోస్టర్లు వెలిశాయి.
అయితే కావాలనే అధికార పార్టీకి చెందిన నేతలు ఇలా పోస్టర్లను అతికిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల్లో బీజేపీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.