Mukesh Ambani : రూ.20 కోట్లు.. రూ.200 కోట్లు.. రూ.400 కోట్లు ఇవ్వాలంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి వరుసపెట్టి వార్నింగ్ మెయిల్స్ రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీటి వెనుక ఎవరున్నారు అని పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. ఈక్రమంలో శనివారం తెలంగాణ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని తెలంగాణకు చెందిన 19 ఏళ్ల గణేష్ రమేష్ వనపర్థిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు నవంబర్ 8 వరకు రిమాండ్ విధించింది.
We’re now on WhatsApp. Click to Join.
ముఖేశ్ అంబానీకి వరుస పెట్టి.. నాలుగు రోజుల్లోనే ఏకంగా మూడు సార్లు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 27న వచ్చిన బెదిరింపు మెయిల్‌లో రూ.20 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు.. ఆ తర్వాతి రోజు (అక్టోబరు 28న) రేటును రూ.200 కోట్లకు పెంచేశారు. అక్టోబర్ 30న దాన్ని డబుల్ చేసి రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరో వార్నింగ్ మెయిల్‌ను పంపారు. నవంబర్ 1న మరో మెయిల్‌ను బ్లాక్ మెయిలర్స్ సెండ్ చేశారు. తాము అడిగినంత ఇవ్వకపోతే చంపేస్తామని ముకేశ్ అంబానీని బెదిరించారు. ఈ మెయిల్స్ అన్నీ.. ఒకే ఈమెయిల్ ఐడీ నుంచి వచ్చాయని ముంబై పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా తెలంగాణలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోవడం(Mukesh Ambani) గమనార్హం.