Wife Killed: శృంగారం వద్దన్నందుకు భార్యను చంపిన భర్త!

తన భార్య శ్రుంగారానికి ఒప్పుకోకపోవడంతో ఓ భర్త ఆమెను కడతేర్చాడు.

Published By: HashtagU Telugu Desk
relation

Crime

భార్య శృంగారానికి నిరాకరించిందన్న కోపంతో ఓ వ్యక్తి ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. శవపరీక్ష రిపోర్టులో మరణానికి గల కారణాలు వెల్లడికావడంతో ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మే 20వ తేదీ రాత్రి నేరం జరిగినప్పటికీ, 10 రోజుల తర్వాత పోలీసులు కేసును ఛేదించారు. భార్య ఝాన్సీ (20) తనతో శృంగారానికి నిరాకరించడంతో గొంతు కోసి హత్య చేసినట్లు జటావత్ తరుణ్ (24) పోలీసుల ఎదుట అంగీకరించాడు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఈ జంట 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆటో రిక్షా డ్రైవర్ అయిన తరుణ్ తన భార్యతో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఐఎస్ సదన్ డివిజన్‌లోని ఖాజా బాగ్‌లో ఉంటున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఏప్రిల్ 16న ఝాన్సీ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.

మే 20వ తేదీ రాత్రి తన కోరికను బయటపెట్టినట్లు తరుణ్ పోలీసులకు తెలిపాడు. బాగా అలసిపోయిందని చెప్పింది. అయినా భర్త ఆమెను బలవంతం చేయడం ప్రారంభించాడు. శ్రుంగారానికి ఇష్టం చూపలేక కేకలు వేసింది భార్య. దీంతో ఆమె భర్త నోరు, ముక్కును మూయడంతో  ఆమె కదలకుండా ఉండిపోయింది. ఆ తర్వాత నోటి నుంచి నురగలు కక్కుతుండగా, భయాందోళనకు గురై బంధువులను అప్రమత్తం చేశాడు. ఆమెను ఒవైసీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతికి గల కారణాలపై భర్త నోరు మెదపలేదు. ఝాన్సీ తండ్రి నేనావత్ రెకియా ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మే 30న శవపరీక్ష నివేదికలో మహిళ ఊపిరాడక చనిపోయిందని తేలింది. పోలీసులు తరుణ్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Also Read: Mega Family: వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్ మెంట్ ఫిక్స్, మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ షురూ!

  Last Updated: 01 Jun 2023, 03:43 PM IST