బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ బాలికపై తెలిసిన ముగ్గురు యువకులు అత్యాచారం (Girl Raped) చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోవడంతో.. ఏమీ తెలియనట్లుగా డ్రామా చేశారు. నల్గొండ జిల్లాలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. సంక్రాంతి పండుగకు అమ్మమ్మ ఊరికి వెళ్లిన ఓ అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ బాలిక పదవ తరగతి చదువుతోంది. సంక్రాంతి పండుగ కోసం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. సంతోషంగా పండగ జరుపుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. వారు ముగ్గురు పెద్ద అడిచర్లపల్లి మండలం వడ్డేరి గూడెనికి చెందిన యువకులు. వారు అంతకుముందే అమ్మాయికి పరిచయం. దీంతో వారితోపాటు అంగడిపేట క్రాస్ రోడ్డు వద్దకు బాలిక వచ్చింది. అక్కడ కారు దిగిన బాలిక హైదరాబాద్ వెళ్లేందుకు బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తోంది.
కాగా ఆ ముగ్గురు యువకుల్లో నరేష్ కు బస్ స్టాప్ కు ఎదురుగానే బట్టల దుకాణం ఉంది. చాలాసేపు బస్సు కోసం ఎండలో ఎదురుచూస్తున్న ఆ అమ్మాయిని నరేష్ తన బట్టల షాపులోకి పిలిచాడు. ఎండలో నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్న బాలికను.. సదరు యుకులు లోపలికి రమ్మని పిలిచారు. ఎండలో ఉండే బదులు.. ఇక్కడ ఫ్యాన్ కింద హాయిగా కూర్చొని వేచి చూడమని చెప్పారు. ఆ తర్వాత ముగ్గురు యువకులు దుకాణం తలుపులు మూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాలిక స్పృహ తప్పి పడిపోయింది. భయపడిపోయిన యువకులు.. బాలికను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Also Read: Former Finance Minister: కాంగ్రెస్‌కు షాకిచ్చిన సీనియర్ నేత.. బీజేపీలో చేరిక
పరీక్షించిన వైద్యులు బాలిక చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే నరేష్, శివ, దిలీప్ పరారయ్యేందుకు ప్రయత్నించారు. బాలిక మృతి చెందడంతో నరేష్, శివ, దిలీప్ లు భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న దేవరకొండ డిఎస్పి నాగేశ్వరరావు అక్కడి పరిసరాలను పరిశీలించారు. తన కూతురి మీద అఘాయిత్యం చేసి హత్య చేశారని బాలిక తండ్రి ఆ ముగ్గురు యువకుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు.