గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..

Hyderabad మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మేకలు, గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్న దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్థానిక మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ కలిసి మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోీసులు వారి నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆ రక్తం కాచిగూడలోని ఓ ల్యాబ్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంయుక్తంగా […]

Published By: HashtagU Telugu Desk
Goat Sheep

Goat Sheep

Hyderabad మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మేకలు, గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్న దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్థానిక మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ కలిసి మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోీసులు వారి నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆ రక్తం కాచిగూడలోని ఓ ల్యాబ్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంయుక్తంగా దాడులు నిర్వహించి.. ల్యాబ్‌​లో సిబ్బందిని ప్రశ్నించారు. మేకలు, గొర్రెల రక్తం నిల్వలు, కొనుగోలు పత్రాలు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

  • ఇంజెక్షన్లతో మేకలు, గొర్రెల రక్తం పిండేసే ముఠా
  • కాచీగూడలోని ఓ ల్యాబ్‌కు విక్రయిస్తున్న నిందితులు
  • ఆ ల్యాబ్‌పై దాడులు జరిపిన అధికారులు

ఇటీవల మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నాగారం ప్రాంతంలోని సత్యనారాయణ కాలనీలో అమానుష ఘటన జరిగిన విషయం తెలిసిందే. మేకలు, గొర్రెలను హింసిస్తూ.. వాటి నుంచి రక్తం పిండేస్తున్న దందా వెలుగుచూసింది. స్థానిక మటన్ షాపు యజమాని, ఒక నకిలీ వెటర్నిటీ డాక్టర్‌తో కలిసి మేకలు, గొర్రెల నుంచి అడ్డగోలుగా రక్తాన్ని సేకరిస్తున్నారు. సూదులతో ఆ మూగజీవాల శరీరం నుంచి రక్తాన్ని పీల్చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మెరుపు దాడి చేసి ఏకంగా 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా ఈ అక్రమ దందా డొంక కదిలింది.

బతికున్న మూగ జీవాల నుంచి అమానుషంగా రక్తాన్ని పిండేసి అమ్ముతున్నారు. అయితే ఆ రక్తాన్ని కొనుగోలు చేస్తున్నది కాచిగూడ బద్రుక కాలేజీ సమీపంలోని సీఎన్కే ల్యాబ్స్ నిర్వాహకులేనని పోలీసుల విచారణలో తేలింది. దీంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంయుక్తంగా దాడులు నిర్వహించింది. ల్యాబ్‌లో సిబ్బందిని ప్రశ్నించి.. మేకలు, గొర్రెల రక్తం నిల్వలు, కొనుగోలు పత్రాలు, ఇతర రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ల్యాబ్ ఓనర్ పరార్..

మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం పిండేస్తున్న దందాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న సీఎన్కే ల్యాబ్ యజమాని నికేశ్.. రెండు రోజుల ముందే పారిపోయాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేశ్ పోలీసులకు పట్టుబడితే.. ఈ అక్రమ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది బయటపడుతుంది.

ఎందుకు రక్తం తీస్తున్నారు?

ఎలాంటి అనుమతి లేకుండా, నిబంధనలు పాటించకుండా మూగ జీవాలని హింసించి తీసిన రక్తాన్ని లేబొరేటరీలకు తరలిస్తున్నారు. ఆ ల్యాబ్‌ల్లో షీప్ బ్లడ్ అగర్ (Sheep Blood Agar) తయారీకి.. ఈ రక్తాన్ని వినియోగిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఈ రక్తాన్ని కొన్ని రకాల వ్యాధుల నివారణకు మందులుగా వాడుతున్నామని నమ్మిస్తూ.. ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, దాదాపు ఏడాది కాలంగా ఈ అక్రమ దందా సాగుతోందని ఇటీవల పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నిందితులు ఒక్కో జంతువు నుంచి దాదాపు 1000 మిల్లీ లీటర్ల రక్తం తీస్తున్నారన్నారు. ఒక్కో లీటర్ రూ. 2 వేలకు పైగా ధరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మటన్ షాపులకు సప్లై చేసే ముందు.. శనివారం అర్ధ రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రక్తం తీస్తున్నారని తెలిసింది. కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న రక్తం ప్యాకెట్లకు.. హ్యూమన్ బ్లడ్ అని లేబుల్ ఉండటంతో.. దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

  Last Updated: 07 Jan 2026, 01:03 PM IST