Site icon HashtagU Telugu

Father’s Awareness: తన కొడుకులా.. మరొకరు బలి కాకూడదనీ!

Helmet

Helmet

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే చాలామంది హెల్మెట్ వాడకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నారని పోలీసుల అధ్యయనంలోనూ తేలింది. తరచుగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నా హెల్మెట్ మాత్రం ధరించడం లేదు. ‘రెండు కిలోమీటర్ల జర్నీ కదా.. హెల్మెట్ పెట్టుకోకపోతే.. ఏం కాదులే’’ అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తుంటారు. ఫలితంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కుమారుడిని కోల్పోయిన ఓ తండ్రి మాత్రం హెల్మెట్ పై అవగాహన కల్పించడం ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

పై ఫొటోలో హెల్మెట్ పట్టుకున్న వ్యక్తి పేరు తేజావత్‌ హరి. హరి కుమారుడు సాయి(18) ఈనెల 8న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వ్యాన్‌ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై మృతి చెందాడు. శిరస్త్రాణం (హెల్మెట్) లేకపోవడంతోనే సాయి మృత్యువాత పడ్డాడని, ఆ పరిస్థితి మరొకరికి రాకూడదని అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో జరిగిన ఊరేగింపులో హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు హరి ఇలా ప్రయత్నం చేశారు. ప్రతిఒక్కరూ ఆయన ప్రయత్నాన్ని అభినందించారు.