నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ కుమారుడు ప్రదీప్ (5) కుక్కల దాడి (Street Dogs) లో మృతి చెందాడు. ఇందల్వాయికి చెందిన గంగాధర్ హైదరాబాద్ హెచ్‌వైడీలోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం కొడుకును తన పని ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలు (Street Dogs) ఒక్కసారిగా బాలుడిపై దాడి (Attack) చేశాయి. చిన్నారిని వీధి కుక్కలు వెంటపడి కరిచి చంపాయి. అభం శుభం తెలియని చిన్నారి (Child) మృతితో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. హైదరాబాదులోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.
వీధికుక్కలు వెంట పడటంతో భయంతో పరుగులు పెట్టి.. చివరికి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. గంగాధర్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందినవాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాదు (Hyderabad) ఉపాధి నిమిత్తం వలస వచ్చాడు. అంబర్పేట్ ఛే నెంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు.. ఒక కుమార్తె (6), ఒక కొడుకు ప్రదీప్ (4) ఉన్నారు. గంగాధర్, భార్య జనప్రియ పిల్లలతో కలిసి అంబర్పేట్ లోని ఎరుకల బస్తీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఐదేళ్ల చిన్నారిపై కుక్కలు (Street Dogs) దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
Also Read: Warangal Politics: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ గుండాల రాజ్యం నడుస్తోంది: రేవంత్ రెడ్డి