తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) మరోమారు అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికగా మారుతోంది. ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025)పోటీలు భాగ్యనగరంలో జరుగుతున్నాయి. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ విశ్వ సుందరి పోటీలు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర పర్యాటక శాఖ (State Department of Tourism) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించబోతుండగా, సుమారు 120 దేశాలకు చెందిన అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
Bomb threat : ముంబయి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అమోఘం. ఏటా లక్షల మంది యువతులు ఈ పోటీల్లో పాల్గొనే ఆశతో దేశవాళీ స్థాయిలో దరఖాస్తులు చేసుకుంటుంటారు. మిస్ వరల్డ్ టైటిల్ గెలవాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల మహిళలు ఈ పోటీకి వస్తారు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగడం ఎంతో గర్వకారణం. అంతేకాకుండా సినిమా, ఫ్యాషన్, వ్యాపార రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్
ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారికి శుభవార్త చెప్పింది పర్యాటక శాఖ. మిస్ వరల్డ్ 2025 పోటీకి సంబంధించిన ఉచిత పాసులను కొందరు లక్కీ విజేతలకు అందించనున్నారు. ఇందుకోసం ఆసక్తిగల వారు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్లో నమోదు చేసుకోవాలి. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపనున్నారు. అయితే అందరికీ కాకుండా, ఎంపికైన కొద్ది మందికే ఈ ఉచిత పాసులు లభిస్తాయి. ఇక, ఇతరులకు బుక్‌మైషో ద్వారా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల ఆకర్షణను ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.