Site icon HashtagU Telugu

Palla Rajeshwar Reddy : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు

A case has been registered against MLA Palla Rajeshwar Reddy

A case has been registered against MLA Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy: బీఆర్‌ఎస్‌ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి షాక్ తగిలింది. బఫర్ జోన్లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని ప్లలాపై కేసు నమోదు అయింది. చెరువుల బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని ఇరిగేషన్ అధికారులు పిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం, నాదం చెరువుల బఫర్ జోన్ లలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా ఝులిపిస్తోంది. FTL, బఫర్ జోన్ పరిధిలో రూల్స్ కు విరుద్ధంగా మాదాపూర్ లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే.

కాగా, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ తోపాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ అయిన ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెప్పినా వినలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: Iron Dome For Mosquitoes : దోమలను వెతికి చంపే ‘ఐరన్ డోమ్’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్