Site icon HashtagU Telugu

Santosh Rao : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ ఎంపీ సంతోష్ రావుపై కేసు

Santosh Rao

Santosh Rao

Santosh Rao : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం డైలమాలో పడింది. దాని నుంచి తేరుకోకముందే కారు పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ సంతోష్‌ రావుపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది.

We’re now on WhatsApp. Click to Join

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో NECL కంపెనీకి చెందిన భూమి ఉంది. అయితే అందులో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపట్టారని సదరు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంతోష్ రావు తో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై బంజరాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లను సృష్టించి ల్యాండ్ కబ్జాకు  సంతోష్ రావు యత్నించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. సంతోష్ రావుపై 420, 468, 471, 447, 120, r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్టు తెలుస్తోంది.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : R K S Bhadauria : బీజేపీలోకి భారత వాయుసేన మాజీ చీఫ్ భదౌరియా

కోర్టులోకి వెళ్లేముందు  కవిత ఏమన్నారంటే.. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. ఆమె  వారం రోజుల కస్టడీ శనివారమే ముగిసింది. దీంతో నిన్న కవితను ఢిల్లీలోని రౌజ్‌  అవెన్యూ  సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది. ఆమెను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోరగా.. మూడు రోజులు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈసందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందన్నారు. కవిత కుటుంబసభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని న్యాయస్థానానికి తెలిపారు. కవితకు కస్టడీలో భాగంగా వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 26 వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటారు. కోర్టులోకి వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ.. తన అరెస్టు అక్రమమని.. న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. మరోవైపు సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను కవిత తరఫు న్యాయవాది దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు.

Also Read : World Tuberculosis Day 2024: నేడు ప్ర‌పంచ టీబీ దినోత్స‌వం.. ఈసారి థీమ్ ఏంటంటే..?