Site icon HashtagU Telugu

Addanki Dayakar: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై కేసు న‌మోదు.. ఆ వ్యాఖ్య‌లే కారణం..!

Addanki Dayakar

Addanki Dayakar

కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar)పై కేసు నమోదైంది. ఈ నెల 5న నిర్మల్‌లో జరిగిన సభలో ద‌యాక‌ర్‌ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని బీజేపీ నేతలు నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద పోలీసులు దయాకర్‌పై కేసు నమోదు చేశారు. ఈనెల 5న నిర్వ‌హించిన‌ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. సీతారాముల‌వారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు ద‌యాక‌ర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆదిలాబాద్ సభలో అద్దంకి దయాకర్ హిందు దేవుళ్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ, ఇతర హిందువులు రాముని వారసులు అని చెప్పుకుంటున్నారని, మీరు ఏ విధంగా రాముడి వారసులు అవుతారని ప్రశ్నించారు. రాముడు మీకు చిన్నాయనా..? సీత మీకు చిన్నమ్మనా..? అని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని అద్దంకి దయాకర్ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Also Read: Pakistan Vs Shinde : పాక్ భాష మాట్లాడే వాళ్లపై దేశద్రోహం కేసు పెట్టాలి.. సీఎం కామెంట్స్

ఎవ‌రీ అద్దంకి ద‌యాక‌ర్‌..?

అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ద‌యాకర్ తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014, 2018, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో అద్దంకి దయాకర్ కీలకంగా పని చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2014లో 1847 ఓట్లతో ఓడిపోయారు. 2018లో 2379 ఓట్ల తేడాతో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2023లో టికెట్ దక్కలేదు.

We’re now on WhatsApp : Click to Join