Car Accident : యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు యువకులు చనిపోయారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని.. యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతులను హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌లుగా గుర్తించారు. వీరంతా 21 ఏళ్లలోపు వారే. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి(Car Accident) తరలించారు.
Also Read :Nitish Kumar Reddy: ఆ విషయంలో నెంబర్ వన్‌గా నిలిచిన తెలుగుతేజం నితీష్ రెడ్డి!
మొత్తం ఆరుగురు యువకులు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి కారులో బయలుదేరారు. మద్యం మత్తులో వినయ్ డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. కారులోని మొత్తం ఆరుగురిలో ఐదుగురు చనిపోగా, మేడబోయిన మణికంఠ యాదవ్ అనే 21 ఏళ్ల యువకుడు బతికాడు.కారు చెరువులో పడగానే.. అతడు కారు అద్దాలను పగులగొట్టి బయటపడ్డాడు. మణికంఠ హైదరాబాద్‌లోని రామన్నపేటకు చెందినవాడు. అయితేే ప్రస్తుతం బోడుప్పల్‌లో ఉంటున్నాడు.దీనిపై భూదాన్ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ నుంచి వివరాలను సేకరిస్తున్నారు.