Site icon HashtagU Telugu

HYD : వామ్మో.. భిక్షాటన చేసే మహిళ రూ.45 వేల మొబైల్ ను వాడుతుంది..

A Beggar Woman Uses A Rs.45

A Beggar Woman Uses A Rs.45

ఈరోజుల్లో భిక్షాటన (Beggar ) చేసే వారి దగ్గరే భారీగా డబ్బు బయటపడుతుంది. రోడ్ల ఫై డబ్బులు అడుగుకుంటూ పెద్ద ఎత్తున దాచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మాసిన బట్టలు, చెదిరిన జుట్టు, వాడిపోయిన ముఖంతో కనిపించే బిచ్చగాళ్లని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. అయ్యో పాపం అని దగ్గరికి పిలిచి, మన శక్తి మేరకు తోచిన సాయం చేస్తాం. ఈ బలహీనతే భిక్షగాళ్లను లక్షాధికారులను చేస్తుంది. అయ్యో అని ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తుండడం తో వారు ఆ డబ్బును దాచుకుంటూ లక్షాధికారులుగా మారుతుంది. ఇప్పటికే అలాంటి వారు ఎంతోమంది వార్తల్లో నిలువుగా..తాజాగా హైదరాబాద్ లో ఆ తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా హైదరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ డ్రైవ్ చేసారు. పలు ప్రాంతాల్లో పోలీసులు చేసిన ఈ దాడుల్లో 15 మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ (Beggar Woman) వద్ద రూ.45 వేల మొబైల్ ఫోన్ను గుర్తించారు. ఈ ఫోన్ ఎక్కడిదని ప్రశ్నించగా తానే కొనుగోలు చేసినట్లు సమాధానం ఇవ్వడం కాస్త షాక్ కు గురయ్యారు. నిజంగా ఈమె కొనుగోలు చేసిందా..లేక ఎక్కడైనా ఎత్తుకొచ్చిందా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇమేకాదు హైదరాబాద్ సిటీ లో చాలామంది యాచకుల దగ్గర విలువైన ఫోన్లు , వస్తువులు కనిపిస్తుంటాయి. కాకపోతే వాటిని బయటకు తీసుకరాకుండా దాచుకుంటారు. కానీ ఈమె మాత్రం పోలీసులకు అడ్డాగా దొరికిపోయింది.

Read Also : TDP : రెండు రోజుల్లో టీడీపీలోకి వసంత , లావు కృష్ణదేవరాయలు