Heart Attack : గుండె పోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి..!

  • Written By:
  • Updated On - February 16, 2024 / 05:59 PM IST

Heart attack : ప్రస్తుత కాలంలో వయస్సుతో పనిలేకుండా గుండెపోటు (Heart attack)తో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. గుప్పెండత గుండె ఒక్కసారిగా ఆగిపోతూ..ప్రాణాలను హరించేస్తుంది. చిన్నా, పెద్ద అని తేడా చూడటం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న వ్యత్యాసం లేదు దీనికి. అసలు విషయంలోకి వెళ్లితే…. తాజాగా జగిత్యాలలో హార్ట్ ఎటాక్ అర్థం తెలియని.. చిన్న పిల్లవాడిని బలి తీసుకుంది. చిట్టి హృదయం ఎంత పని చేస్తుంది. ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. చూస్తుండగానే మనుషులు హార్ట్ స్టోక్‌కు గురై.. చనిపోతున్నారు. చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపే ముదసలి వరకు అందర్ని తీసుకుపోతుంది ఈ హార్ట్ ఎటాక్. నిన్నటికి నిన్న ఖమ్మం జిల్లాలో ఓ బస్సు డ్రైవర్ డ్యూటీలో ఉండగానే.. గుండె పోటుకు గురై వాహనాన్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అతడు మాత్రం మృత్యువు నుండి తప్పించుకోలేకపోయాడు.

We’re now on WhatsApp. Click to

ఈ చేదు విషయం మరువక ముందే ఇంతలోనే జగిత్యాలలో విషాదం చోటుచేసుకుంది. హార్ట్ ఎటాక్ అర్థం తెలియని.. చిన్న పిల్లవాడిని బలి తీసుకుంది. జగిత్యాల జిల్లాలోని థరూర్ గ్రామానికి చెందిన హర్షిత్ అనే 9 ఏళ్ల బాలుడు. స్థానిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు హర్షిత్. దర్శనం అనంతరం స్వగ్రామానికి బయలు దేరారు ఆ కుటుంబం. ఇంటికి చేరుకుంటున్నాం అనగానే.. హర్షిత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాబు గుండె పోటుతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆ గ్రామలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో బాలుడు హర్షత్ గుండె పోటుతో మృతి చెందడం పట్ల అందరిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. కుటుంబంతో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన అతడు అర్థరాత్రి తిరిగి రూముకి చేరుకున్నాడు, అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.చిన్న వయసులోనే హర్షత్ గుండె పోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. చివరిగా తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన హర్షిత్.

Rice Water : చిక్కుబడ్డ జుట్టుకు సిల్కీ షైన్….!