Site icon HashtagU Telugu

TS Polls 2023 : జగిత్యాల అసెంబ్లీ బరిలో 82 ఏళ్ల వృద్ధురాలు పోటీ

82 Year Old Woman Nominated

82 Year Old Woman Nominated

ఎవరైనా సమాజాన్ని అభివృద్ధి చేయాలనో..ప్రజలకు సేవ చేయాలనో లేదంటే పార్టీ ల కోపం తో ..నేతలపై కోపం తో ఎన్నికల బరిలో నిల్చుంటారు. కానీ ఇక్కడ ఓ 82 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు ఫై కోపం తో ఎన్నికల బరిలో నిల్చువడం అందర్నీ ఆశ్చర్యానికి , షాక్ కు గురి చేస్తుంది. ఈ ఘటన జగిత్యాల నియోజకవర్గం (Jagtial Assembly Constituency) లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కూరిక్యాలకు (Kurikyas of Gangadhara Mandal) చెందిన చీటి శ్యామల ( Cheeti Shyamala) (82)కు పెద్ద కొడుకు నుంచి వేధింపులు పెరిగాయి. ఇల్లు స్వాధీనం చేసుకున్న అతను కేసులు పెట్టి తల్లిని కోర్టులు చూట్టు తిప్పుతున్నాడు. తన ఆవేదనను , బాధను ఎవరు పట్టించుకోవడం లేదని దగ్గరి బంధువులకు చెప్పిన , స్థానిక నేతలకు చెప్పిన అంత తన కొడుకు కే సపోర్ట్ గా మాట్లాడుతుండడం తో చేసేదేం లేక..తన సమస్యను సమాజం, మీడియా దృష్టికి తీసుకెళ్లాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యింది. స్థానికులతో కలిసి జగిత్యాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నామినేషన్ వేసింది. ముసలితనంలో ఆరోగ్యం బాగోలేక బాధపడుతున్న తనకు..తన కొడుకు ఆస్పత్రిలో కూడా చూపించడం లేదని వాపోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్యాయం జరగాలని నామినేషన్ వేస్తున్నానని శ్యామల తెలిపింది. ప్రస్తుతం ఈమె నామినేషన్ వేయడం వార్తల్లో హైలైట్ అవుతుంది.

ఏ తల్లిదండ్రులైనా తాము కష్టపడినా పిల్లలు సుఖంగా ఉండాలని భావిస్తారు. వారి కోసం కష్టపడతారు. కానీ ఆ పిల్లలే పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోరు. కనీసం అన్నం కూడా పెట్టకుండా నడిరోడ్డు ఫై వదిలేస్తారు. ఇంకొంతమందైతే వృద్ధ ఆశ్రమంలో పడేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్న..శ్యామల చేస్తున్న పని మాత్రం అందరు మాట్లాడుకునేలా అయ్యింది.

Read Also : BJP BC Atma Gourava Sabha: మోడీ నాయకత్వంలో భారత్ 30 ఏళ్ల ప్రగతిని సాధించింది: పవన్