Site icon HashtagU Telugu

Number Plate : స్కూటీ నెంబర్ ప్లేట్ కు మాస్క్ తొడిగిన యువకుడికి 8 రోజుల జైలు శిక్ష

8 Days Imprisonment For The Youth Who Removed The Mask To The Scooter Number Plate

8 Days Imprisonment For The Youth Who Removed The Mask To The Scooter Number Plate

స్కూటీ నెంబర్ ప్లేట్ (Scooty Number Plate) కు మాస్క్ తొడిగి ట్రాఫిక్ సిబ్బందికి మస్కా కొట్టే ప్రయత్నం చేశాడో యువకుడు. తనిఖీల్లో పట్టుబడ్డ యువకుడిని పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వాహనం నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం తీవ్రమైన నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. పాతబస్తీకి చెందిన ఆ యువకుడిని జైలుకు పంపించింది. హైదరాబాద్ పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ ఘటన.

నెంబర్ ప్లేట్ (Number Plate) కనిపించకుండా మాస్క్ పెట్టి వాహనం నడుపుతున్న సయ్యద్‌ షోయబ్ అక్తర్ అలీని రెయిన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా.. మెజిస్ట్రేట్ 8 రోజుల జైలు శిక్ష విధించారు. దీంతో షోయబ్ ను పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు. రూల్స్ ను ఉల్లంఘించే వాహనదారుల ఫొటోలు తీసి ట్రాఫిక్ సిబ్బంది, ఇంటికే చలాన్లు పంపిస్తున్నారు.

భారీ మొత్తంలో పడే ఈ జరిమానా నుంచి తప్పించుకోవడానికి కొంతమంది నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్ పెట్టడమో, నెంబర్ ప్లేట్ ను కొద్దిగా వంచడమో చేస్తున్నారు. నెంబర్ కనిపించకపోవడంతో చలానా పంపడం సాధ్యం కావడంలేదు. అయితే, నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం తీవ్రమైన నేరమని పోలీసులు చెబుతున్నారు. తనిఖీలలో పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు.

Also Read:  Home Loan : గృహ రుణాలు చాలా రకాలు ఉన్నాయి.. అవేంటంటే..!