CCTV : నిఘా నేత్రంలో తెలంగాణ.. 8.3 లక్షల కెమెరాలతో మానిటరింగ్!

హైదరాబాద్ అంటేనే ఒక మినీ ఇండియా.. అన్ని కులాలు, జాతులవాళ్లు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందతుంటారు. విద్య, వైద్య, ఉపాధి.. ఇలా అనేక రంగాలకు నిలయంగా మారుతోంది.

  • Written By:
  • Updated On - November 10, 2021 / 02:47 PM IST

హైదరాబాద్ అంటేనే ఒక మినీ ఇండియా.. అన్ని కులాలు, జాతులవాళ్లు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందతుంటారు. విద్య, వైద్య, ఉపాధి.. ఇలా అనేక రంగాలకు నిలయంగా మారుతోంది. ఒకవైపు డెవలప్ మెంట్ లో దూసుకుపోతుంటే.. మరోవైపు సోషల్ ఇష్యూ లాంటి సమస్యలకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా మానక అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ ప్లేస్ లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే తెలంగాణ పోలీస్ యంత్రాగం లైంగిక అక్రమ రవాణా, చోరీలు, హత్యలు లాంటివన్నీ నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది. పై సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసింది. తద్వారా నేరాలను అరికట్టే దిశగా ముందుకు సాగుతోంది.

హైదరాబాద్ టోటల్ సిటీగా నిఘానేత్రంగా అవతరించనుంది. విస్తృతమైన నిఘా మానవ హక్కులను ప్రమాదంలో పడేస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో పేర్కొంది, తెలంగాణ పోలీస్ వ్యవస్థ CCTV కెమెరా నెట్‌వర్క్ ఏర్పాటుపై దృష్టి సారించింది. తెలంగాణ అంతటా దాదాపు 8.3 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ హైదరాబాద్, బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అటాచ్ చేసి ఉంటాయి. తద్వారా భద్రతా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే వీలు కలుగుతుంది.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకేసారి 600,000 కెమెరాల డేటాను ప్రాసెస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. వ్యక్తులను ట్రాక్ చేయడానికి ఈ కెమెరాలను హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక సాఫ్ట్ వేర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ’ ద్వారా మీరు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి చేస్తారు? లాంటి విషయాలను సులువుగా తెలుసుకోవచ్చును. అయితే ఈ రకం టెక్నాలజీని కొందరు మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి గోప్యత మానవ హక్కులను ప్రమాదంలో పడేస్తుందన్నారు. ముఖ గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని భారత అధికారులు తక్షణమే నిలిపివేయడం అత్యవసరమని న్యాయవాది అనుష్క జైన్ అభిప్రాయపడ్డారు.