Gandhi Hospital: డాక్టర్లకు ‘ఓమిక్రాన్’ టెన్షన్

  • Written By:
  • Updated On - January 11, 2022 / 05:52 PM IST

తెలంగాణాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న డాక్టర్స్ కమ్యూనిటీలో ఎక్కవ కేసులు నమోదవుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో 20 మంది ఎంబీబీస్ విద్యార్థులకు, 10 మంది హౌజ్ సర్జన్స్ కి, 10 మంది పీజీ విద్యార్థులకు, నలుగురు అధ్యాపకులకు మొత్తం 79మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇక ఉస్మానియా హాస్పిటల్ లో 25 మంది హౌజ్ సర్జన్స్ కి, 23 మంది పీజీ విద్యార్థులకు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి మొత్తం 44 మందికి, కాకతీయ మెడికల్ కాలేజీలో 45 మందికి కరోనా పాజిటివ్ అని సమాచారం.

మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.గాంధీ హాస్పిటల్ లో ఎలక్టీవ్ డ్యూటీస్ నిలిపి కేవలం ఎమర్జెన్సీ మాత్రమే తీసుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా హాస్పిటల్లో కొవిడ్ కేసులు పెరిగే అక్కడ కూడ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27 వేల ఆక్సిజన్ బెడ్స్ సిద్దంగా ఉంచామని, కేసులు భారీస్థాయిలో పెరిగిత. ఆసుపత్రుల్లోని ప్రతి బెడ్ కరోనా పేషేంట్లకోసం వాడుతామని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణాలో కేవలం హైదరాబాద్లోనే 90%శాతం కేసులు ఉన్నాయి. సెలవుల పేరుతో గ్రామాలకు వెళ్లి గ్రామాల్లోని వారికి కరోనా అంటించవద్దని వైద్యులు కోరుతున్నారు. హైదరాబాద్ నుండి జనాలు గ్రామాల్లోకి వెళ్తే, సంక్రాంతి పండగ తర్వాత గ్రామాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతాయని వైద్యులు భావిస్తున్నారు. సెకండ్ వేవ్ ప్రతి నలుగురిలో ఒక్కరికి మాత్రమే కరోనా సోకిందని, కానీ ఒమైక్రాన్ అందరికీ సోకే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలందరు కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.