Site icon HashtagU Telugu

Trains Cancelled : 78 రైళ్లు రద్దు.. 26 ఎక్స్‌ప్రెస్‌లు దారిమళ్లింపు

Passenger Trains

Trains Cancelled : తెలంగాణలోని ఆసిఫాబాద్‌-రేచ్ని రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా వచ్చే 11 రోజుల పాటు వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ ప్రభావం ప్రధానంగా కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో రాకపోకలు సాగించే రైళ్లపై(Trains Cancelled) పడనుంది. దీంతో 26 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

రద్దయిన రైళ్ల వివరాలివీ.. 

  • కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం.12757/12758) జూన్‌ 26 నుంచి జులై 6 వరకు రద్దు
  • పూణే -కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (నం.22151) ఈ నెల 28, జులై 5 తేదీల్లో రద్దు
  • కాజీపేట-పూణే ఎక్స్‌ప్రెస్‌ (నం.22152) జూన్‌ 30, జులై 7న తేదీల్లో రద్దు
  • హైదరాబాద్‌-గోరఖ్‌‌పూర్ ఎక్స్‌ప్రెస్ (నం.02575) జూన్‌ 28న రద్దు
  • గోరఖ్‌‌పూర్ -హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం.02576) జులై 30న రద్దు
  • ముజఫర్‌‌పూర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం.05293) జులై 2న రద్దు
  • సికింద్రాబాద్‌-ముజఫర్‌‌పూర్ ఎక్స్‌ప్రెస్‌  (నం.05294) జూన్‌ 27, జులై 4 తేదీల్లో రద్దు
  • గోరఖ్‌‌పూర్ -జడ్చర్ల  ఎక్స్‌ప్రెస్ (నం.05303) జూన్‌ 29న రద్దు
  • జడ్చర్ల-గోరఖ్‌‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ (నం.05304) జులై 1న రద్దు
  • సికింద్రాబాద్‌-రాక్సల్‌ మధ్య తిరిగే మూడు వేర్వేరు రైళ్లు జూన్‌ 26, 27, 28 తేదీల్లో రద్దు
  • సికింద్రాబాద్‌-దానాపూర్ మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్‌ 27, 28, 29, జులై 1 తేదీల్లో రద్దు
  • సికింద్రాబాద్‌-సుభేదార్‌గంజ్‌ మధ్య తిరిగే పలు రైళ్లు జూన్‌ 27, 29 తేదీల్లో రద్దు

Also Read :Lok Sabha MPs : స్పీకర్ ఎన్నికలో ఓటింగ్‌కు దూరంగా ఆ ఎంపీలు.. ఎవరికి లాభం ?

దారి మళ్లించిన రైళ్ల వివరాలివీ. 

  • కాజీపేట మీదుగా నడిచే సికింద్రాబాద్‌ – న్యూఢిల్లీ ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌’ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్‌ మీదుగా దారి మళ్లించనున్నారు. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించారు.
  • న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌‌కు వచ్చే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీలలో ముద్కేడ్, నిజామాబాద్‌ మీదుగా నడిపించనున్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించారు.
  • సికింద్రాబాద్‌-నిజాముద్దీన్‌ (ఢిల్లీ), నిజాముద్దీన్‌-సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపించనున్నారు.

Also Read :Income Tax Payers: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్‌.. సెక్షన్ 80C అంటే ఏమిటి..?