Hyderabad: హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను దశలవారీగా లబ్దిదారులకు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రోజు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బల్దియాలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రస్తుతం 70 వేల ఇళ్లను పూర్తి చేశామని కేటీఆర్ చెప్పారు. వీటిలో దాదాపు 4,500 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించామని కేటీఆర్ అన్నారు. ఇళ్లను లబ్దిదారులకు అందించే కార్యక్రమం శరవేగంగా జరుగుతున్నదని, దరఖాస్తులు సమర్పించిన దరఖాస్తుదారుల వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతమైనదని మంత్రి చెప్పారు.
ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ జరిపిన సమీక్ష సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎండీ మహమూద్ అలీ, సీహెచ్ మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.
Also Read: Theft: చోరీలు చేస్తూ కోట్లకు పడగలెత్తిన దొంగ.. ఇల్లు, గెస్ట్ హౌస్ ఫుల్ లగ్జరీ లైఫ్?