Telangana Polling : తెలంగాణ పోలింగ్.. ఏయే జిల్లాలో.. ఎంతెంత శాతం ?

Telangana Polling : గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌‌కు సంబంధించిన కీలక గణాంకాలు విడుదలయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Polling Ended Peacefully In Telangana, This Is The Final Voting Percentage

Polling Ended Peacefully In Telangana, This Is The Final Voting Percentage

Telangana Polling : గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌‌కు సంబంధించిన కీలక గణాంకాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ యాదాద్రి జిల్లాలో జరిగింది. ఇక్కడి ఓటర్లలో 90.03 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీని  తర్వాత అత్యధిక పోలింగ్  జరిగిన జిల్లాల్లో మెదక్ (86.69 శాతం), జనగాం (85.74 శాతం), నల్గొండ (85.49 శాతం), సూర్యాపేట (84.83 శాతం), మహబూబాబాద్ (83.70 శాతం), ఖమ్మం (83.28 శాతం), ములుగు (82.09 శాతం), భూపాలపల్లి (81.20 శాతం), గద్వాల్ (81.16 శాతం) ఉన్నాయి.  ఇక అత్యల్ప పోలింగ్ జరిగిన జిల్లాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ కేవలం 46.56 శాతం పోలింగ్ నమోదైంది.  రంగారెడ్డి జిల్లాలో  59.94 శాతం, మేడ్చల్ జిల్లాలో 56 శాతం పోలింగ్ జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో ఎక్కువగా 91.51 శాతం, యాకుత్‌పురాలో అత్యల్పంగా 39.9 శాతం పోలింగ్(Telangana Polling) నమోదైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తెలంగాణ వ్యాప్తంగా 70.66 శాతం పోలింగ్ నమోదైంది. 2018తో పోలిస్తే ఈసారి తెలంగాణలో పోలింగ్ 3 శాతం తగ్గింది. జనరల్‌గా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే.. పోలింగ్ శాతం పెరుగుతుందనీ, వ్యతిరేకత లేకపోతే పోలింగ్ శాతం తగ్గుతుందని అంటారు. ఈ నేపథ్యంలో ఫలితం బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. సెలవుల కారణంగా ప్రజలు లీవ్స్ తీసుకొని.. సొంత ఊర్లకు వెళ్లిపోయారనీ.. అందువల్లే పోలింగ్ శాతం తగ్గిందని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఏదిఏమైనా డిసెంబరు 3న రియల్ రిజల్ట్ తేలిపోతుంది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం

ఆసిఫాబాద్ – 80.82

సిద్దిపేట – 79.84

కామారెడ్డి – 79.59

నాగర్ కర్నూల్ – 79.46

భద్రాద్రి – 78.65

నిర్మల్ – 78.24

వరంగల్ – 78.06

మహబూబ్‌నగర్ – 77.72

వనపర్తి – 77.64

నారాయణపేట – 76.74

పెద్దపల్లి – 76.57

వికారాబాద్ – 76.47

సంగారెడ్డి – 76.35

సిరిసిల్ల – 76.12

జగిత్యాల – 76.10

మంచిర్యాల – 75.59

కరీంనగర్ – 74.61

నిజామాబాద్ – 73.72

హనుమకొండ – 66.38

Also Read: AP Vs Telangana : సాగర్‌పై ఏపీ వర్సెస్ తెలంగాణ.. జల జగడం ఎందుకు ?

  Last Updated: 01 Dec 2023, 10:32 AM IST