Site icon HashtagU Telugu

HYD : హైదరాబాద్ లో మరో 7 ఫ్లైఓవర్లు – సీఎం రేవంత్

Cm Revanth Reddy Green Sign

Cm Revanth Reddy Green Sign

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కొత్తగా మరో 7 ఫ్లైఓవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. నగర అభివృద్ధికి సంబంధించి సమీక్ష నిర్వహించిన ఆయన, కోర్ అర్బన్ అభివృద్ధి ప్రణాళికలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇందులో భాగంగా చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు.

Heart Disease: మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?

వరద సమస్యను తగ్గించేందుకు నాలాల పరిమాణాన్ని పెంచాలని, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవన విధానం కొనసాగుతుందని తెలిపారు. ఫ్లైఓవర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, ఇతర అనుమతులు త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పనుల వేగాన్ని పెంచేందుకు త్వరలోనే టెండర్లు పిలవాలని సూచించారు. నగర రహదారుల అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అంతేగాక, ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ తెలిపారు. ప్రధాన రహదారులు, కనెక్టివిటీ మార్గాలను విస్తరించి మెరుగైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాలు అమలు చేయాలని చెప్పారు.