6th Class Student Letter : ‘బార్‌’ ను తీసేయాలంటూ హైకోర్టుకు ఆరో తరగతి విద్యార్థిని లేఖ..

జనావాసాల మధ్య ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ (Bar and Restaurant ) ను తీసేయాలంటూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కు ఆరో తరగతి విద్యార్థి (6th Class Student ) ని లేఖ రాయడం

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 09:43 PM IST

జనావాసాల మధ్య ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ (Bar and Restaurant ) ను తీసేయాలంటూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కు ఆరో తరగతి విద్యార్థి (6th Class Student ) ని లేఖ రాయడం..దీనిపై కోర్ట్ స్పందించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణ లో వైన్ షాపులు , బార్ అండ్ రెస్టారెంట్ ల ఎంతగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. బడులు , గుడులు కనిపిస్తాయో లేదో కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ , వైన్ షాప్స్ మాత్రం ఎటు చూసిన దర్శనం ఇస్తాయి. ఒకప్పుడు జనావాసాలకు దూరంగా ఉండేవి..కానీ ఇప్పుడు జనావాసుల మధ్య..గుడులు , బడుల మధ్య ఏర్పాటు చేస్తూ..ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ఆరో తరగతి విద్యార్థిని తెలంగాణ హైకోర్టు కు లేఖ రాసింది.

We’re now on WhatsApp. Click to Join.

హయాత్‌నగర్ నుంచి సాహెబ్​నగర్ వెళ్లే దారిలో ప్రధాన రహదారిపై నివాసాల మధ్య సాయి యువ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసారు. దీనిని తొలగించాలని ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తెలంగాణ హైకోర్టు కు లేఖ రాసింది. బార్‌కు ఎదురుగా శివాలయం ఉందని, గుడికి వెళ్లేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నారని, 30 శాతం మంది సీనియర్ సిటిజన్లు సాయంత్రమైతే పాల కోసం కూడా బయటికి రాలేకపోతున్నారన్నారని, ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులు, తాగుబోతుల వీరంగంతో సరైన నిద్రలేక సతమతమవుతున్నారని లేఖలో పేర్కొంది. ఫిబ్రవరి 29న అందిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(Public Interest Litigation)గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ట్ అనిల్‌ కమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కోర్ట్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆబ్కారీ, హోం శాఖల ముఖ్యకార్యదర్శులు, జీహెచ్ఎంసీ(GHMC), రాచకొండ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Read Also : Fish Fry: అరటిఆకులో టేస్టీ చేపల ఫ్రై.. ఇలా చేస్తే మొత్తం ఖాళీ అవ్వాల్సిందే?