She Teams : మహిళలను వేధిస్తూ షీటీమ్స్‌కి ప‌ట్టుబ‌డ్డ 66 మంది య‌వ‌కులు

మ‌హిళలను వేధిస్తూ 66 మంది యువ‌కులు షీటీమ్స్‌కి ప‌ట్టుబ‌డ్డారు వీరిలో 32 మంది మైనర్‌లు ఉన్నారు.

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 03:20 PM IST

మ‌హిళలను వేధిస్తూ 66 మంది యువ‌కులు షీటీమ్స్‌కి ప‌ట్టుబ‌డ్డారు వీరిలో 32 మంది మైనర్‌లు ఉన్నారు. వీరంద‌రిని 15 రోజుల్లో రాచకొండ షీ టీమ్ అధికారులు పట్టుకున్నారు.  షీటీమ్స్‌కి అందిన ఫిర్యాదుల్లో 21 లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. వీరిలో కొంత‌మందిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అరెస్టయిన వారిలో ఓ వ్యక్తి .. లేడీ డాక్టర్‌ని వేధిస్తున్నాడు. సదరు వ్యక్తి లేడీ డాక్టర్ పని చేసే ఆసుపత్రికి వెళ్లి ఆమెతో గొడవ పడి దారుణంగా కొట్టాడు. లేడీ డాక్ట‌ర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.మ‌రో ఘ‌ట‌న‌లో బాధితురాలి తల్లిదండ్రులను వేధిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని అరెస్టు పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక త‌న ప్రేమ‌ను తిరస్కరించడంతో నిందితుడు ఆమె తల్లిదండ్రులను బెదిరించాడు.ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా నిందితుడిని అరెస్ట్ చేశారు. భోనగిరి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఓ బాలిక‌ను నిందితుడు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు స‌ద‌రు బాలిక‌ను త‌న‌ను క‌ల‌వాల‌ని బ‌ల‌వంతం చేస్త‌న్న‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ పరిధిలో మొత్తం 66 మంది యువ‌కుల‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.